ఇన్నాళ్లు వేచి ఉన్నందుకు మార్చి 2017 న ఫలితం
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు హోండా మోటార్స్ తమ డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్‌ని మార్చి 2017న విడుదల చేయనుంది. పూర్తి వివరాల కోసం....
జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ గత ఏడాది బ్రెజిల్‌లో డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్‌ని ఆవిష్కరించింది. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా హోండాకు ఇది అతి ముఖ్యమైన మోడల్. భారీ అంచనాలతో ఈ ఏడాది పూర్తి స్థాయి విడుదలకు చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

హోండా మోటార్స్ డబ్ల్యూఆర్-వి విడుదలకు ముందే రాజస్థాన్ లో ఉన్న తపుకరా ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించింది. హోండా గత ఏడాది విడుదల చేసిన బిఆర్-వి ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరపడం లేదు. అందుకు ఇప్పుడు డబ్ల్యూఆర్-వి మీద భారీ అంచనాలను పెట్టుకుంది.

గాడివాడి అనే వార్తా వేదిక తెలిపిన వివరాల మేరకు హోండా మోటార్స్ డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్‌ను మార్చి 2017 న దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.

హోండా తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ జాజ్ యొక్క ఫ్రంట్ డిజైన్ ప్రేరణతో డబ్ల్యూఆర్-వి ముఖ భాగంలో పదునైన హెడ్ ల్యాంప్స్, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఎక్కువ మందంతో చతురస్రాకారంలో ఉన్న క్రోమ్ బార్ మరియు స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.

ఇంటీరియర్‌లో ప్రధానంగా తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఎమ్ఐడి గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కన్నా అత్యాధునికంగా దీని ఇంటీరియర్ అభివృద్ది చేయడం జరిగింది.

సాంకేతిక వివరాల పరంగా చూస్తే, డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్ 1.5-లీటర్ల సామర్థ్యం ఉన్న డీజల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ లతో వచ్చే అవకాశం ఉంది.

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే పెట్రోల్ వేరియంట్ కోసం 5-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా డీజల్ వేరియంట్ కోసం 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం విపణిలో ఉన్న విపరీతమైన పోటీని ఎదుర్కునేందుకు 6.5 లక్షల నుండి 9.5 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ కాంపాక్ట్ క్రాసోవర్ విడుదలతో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి వితారా బ్రిజా, ఐ20 ఆక్టివ్ వోక్స్‌వ్యాగన్ పోలో, టయోటా ఎటియోస్ లివా మరియు ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్ వంటి వాటికి గట్టి పోటీని సృష్టించనుంది.

హోండా మోటార్స్ యొక్క అన్ని కార్లే ఫోటోల వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి....
హోండా బిఆర్-ని చూడాలనుకుంటున్నారా....? డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ కోసం 55 ఫోటోలున్న గ్యాలరీని అందించింది. వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








