డబ్ల్యూఆర్-వి విడుదలను సూచిస్తూ, హోండా టీజర్

Written By:

హోండా మోటార్స్ దేశీయంగా తమ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్దమయ్యింది. మార్చి 16, 2017 న క్రాసోవర్ వేరియంట్ డబ్ల్యూఆర్-వి ను విడుదల చేయడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేసుకుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా డబ్ల్యూఆర్-వి

జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ యొక్క జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో రూపొందించబడిన డబ్ల్యూఆర్-వి విడుదలను సూచిస్తూ టీజర్ ఫోటోను విడుదల చేసింది. అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్ మీద దృష్టి సారిస్తూ, పెద్ద పరిమాణంలో గీతలున్న బ్యానెట్, రూఫ్ రెయిల్ మరియు ప్లాస్టిక్ క్లాడింగ్‌తో రానుంది.

హోండా డబ్ల్యూఆర్-వి

ఎక్ట్సీరియర్ డిజైన్ మీజ దృష్టి పెడితే రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కలవు.

హోండా డబ్ల్యూఆర్-వి

ఇంటీరియర్‌లో స్పోర్టివ్ తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కలదు.

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా డబ్ల్యూఆర్-విలో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వెర్షన్‌లో 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం గల ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు.

హోండా డబ్ల్యూఆర్-వి

డబ్ల్యూఆర్-వి లోని డీజల్ వెర్షన్‌లో 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ కలదు. రెండు ఇంజన్‌లను కూడా జాజ్ హ్యాచ్‌బ్యాక్ నుండి సేకరించి ఇందులో అందిస్తున్నారు.

హోండా డబ్ల్యూఆర్-వి

డబ్ల్యూఆర్-వి మోడల్ ఇండియన్ మార్కెట్లో హోండా మోటార్స్‌కు అత్యంత ముఖ్యమైన మోడల్‌గా నిలవనుంది. ఇది సుమారుగా రూ. 7 లక్షల నుండి 9 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

హోండా డబ్ల్యూఆర్-వి

డబ్ల్యూఆర్-వి పూర్తి స్థాయిలో అమ్మకాలకు సిద్దమైతే, ప్రస్తుతం విపణిలో ఉన్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మారుతి సుజుకి వితారా బ్రిజా, హ్యుందాయ్ ఐ20 ఆక్టివ్ మరియు టయోటా ఎటియోస్ క్రాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

 
English summary
Honda WR-V Teased Ahead Of India Launch — Will It Be Tough Enough?
Story first published: Tuesday, February 28, 2017, 18:21 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark