బాలెనో ఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు డబ్ల్యూఆర్-వితో హోండా మరో ఎత్తుగడ

Written By:

హోండా మోటార్స్ ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీని మరింత శక్తివంతమైన ఇంజన్ వేరియంట్లో విడుదల చేయడానికి సన్నద్దం అవుతోంది. హాట్ హ్యాచ్ క్రాసోవర్‌గా పర్ఫామెన్స్ ప్రేమికుల మీద దృష్టి సారించి హోండా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆటోకార్ ఇండియా ప్రచురించి కథనం మేరకు, హోండా తమ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్‌ను శక్తివంతమైన వెర్షన్‌లో విడుదల చేసే దాని మీద పనిచేస్తున్నట్లు తెలిసింది. పర్ఫామెన్స్ ప్రేమికులను ఆకర్షించడానికి తమ నూతన 2017 సిటి సెడాన్‌లో ఉపయోగించిన పెట్రోల్ ఇంజన్ ఇందులో అందించే అవకాశం ఉంది.

హోండా తాజాగ విడుదల చేసిన 2017 సిటి సెడాన్‌లో ఉపయోగించిన 1.5-లీటర్ల సామర్థ్యం ఉన్న ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 114బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఈ పెట్రోల్ వేరియంట్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో రానుంది. శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ జోడింపుతో డబ్ల్యూఆర్-వి లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లోటు తీరిపోనుంది.

డబ్ల్యూఆర్-విలో 1.5-లీటర్ వేరియంట్ పరిచయం కావడం ద్వారా, ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఫియట్ అవెంచురా, అవెంచురా అర్బన్ క్రాస్, ఫియట్ పుంటో అబర్త్, మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో జిటి వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది.

డబ్ల్యూఆర్-వి లో టైప్-ఆర్ స్పోర్ట్ బ్యాడ్జ్ వచ్చే అవకాశం చాలా తక్కువ, సాధారణ కారుకు ఉండాల్సిన ఇంజన్ కన్నా ఎక్కువ పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ అందించి టైప్-ఆర్ బ్యాడ్జిని హోండా జోడిస్తుంది. అయితే ఇది డబ్ల్యూఆర్-వి రావడం అసంభవమనే చెప్పాలి.

 

English summary
Honda WR-V Set To Get A More Powerful Engine — Hot Hatch Time?
Story first published: Friday, March 31, 2017, 12:50 [IST]
Please Wait while comments are loading...

Latest Photos