హ్యుందాయ్ నుండి మరో ఇంట్రెస్టింగ్ మోడల్

Written By:

భారతదేశపు రెండవ బెస్ట్ సెల్లింగ్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ విపణిలోకి సరికొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి నూతన ప్రణాళికలు వల్లిస్తోంది. అందులో భాగంగా అధిక డిమాండ్ ఉన్న సెగ్మెంట్లోకి కొత్త కార్లను విడుదలకు సిద్దం చేస్తోంది.

హ్యుందాయ్ కార్లినో

నిజానికి ప్రతి కస్టమర్‌ను చేరుకోవాలంటే చిన్న కార్ల విడుదల ఎంతో కీలకం. ఆ తరువాత ఖరీదైన హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలు, మరియు సెడాన్ కార్ల ద్వారా భారీ సక్సెస్ అందుకోవడం సులభం అవుతుంది. ఇందుకు ఉదాహరణ: మారుతి సుజుకి తొలినాళ్ల నుండి ఎన్నో రకాల చిన్న కార్లను ఉత్పత్తి చేస్తూ వచ్చి, ఇప్పుడు ఖరీదైన ఎస్‌యూవీలు మరియు సెడాన్‌లో మార్కెట్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
హ్యుందాయ్ కార్లినో

అయితే దక్షిణ కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియాలో తమ ఉనికిని చాటుకోవడానికి అనేక కొత్త మోడళ్లను అభివృద్ది చేసింది. తాజాగా హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ వై కె కూ మాట్లాడుతూ భారత్‌లో తమ తర్వాత ఉత్పత్తిగా "కార్లినో ఎస్‌యూవీని" విడుదల చేస్తామని వెల్లడించాడు.

హ్యుందాయ్ కార్లినో

తాజాగా విపణిలోకి నెక్ట్స్ జనరేషన్ వెర్నా సెడాన్ కారును విడుదల చేస్తూ, హ్యుందాయ్ తరువాత‌ మోడల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అని పేర్కొన్నాడు. హ్యుందాయ్ అతర్గతంగా క్యూఎక్స్ఐ అనే కోడ్ పేరుతో కార్లినో ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో హ్యుందాయ్ వారి తొలి ప్రొడక్ట్ కార్లినో.

హ్యుందాయ్ కార్లినో

హ్యుందాయ్ కార్లినో ఎస్‌యూవీని 60 శాతం దేశీయంగా ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లలో అభివృద్ది చేసినట్లో గతంలో ప్రకటించింది. దీనిని తొలుత 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కాన్సెప్ట్ దశలో ఆవిష్కరించింది.

హ్యుందాయ్ కార్లినో

ప్రొడక్షన్ దశకు వచ్చే హ్యుందాయ్ కార్లినో కాన్సెప్ట్ వెర్షన్‌తో పోల్చుకుంటే డిజైన్ పరంగా ఎన్నో మార్పులు జరగనున్నాయి. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో పరిచయం కానుంది.

హ్యుందాయ్ కార్లినో

హ్యుందాయ్ ఐ20 యూరోపియన్ మోడల్‌లో ఉన్న 1.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు దేశీయంగా ఉన్న క్రెటా, ఎలైట్ ఐ20 కార్లలో ఉన్న 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లతో రానుంది.

హ్యుందాయ్ కార్లినో

హ్యుందాయ్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికగా తమ ఫ్యూచర్ ప్రొడక్టులను రివీల్ చేయనుంది. ఇదే వేదికగా తక్కువ ఖరీదైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిజ్ఞానం ఉన్న కార్లను ప్రదర్శించనుంది. 2020 నాటికి కాంపాక్ట్ ఎస్‌యూవీల సంఖ్యను ఏడుకు పెంచుకునే ప్రణాళికలో భాగంగా మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కార్లినో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్లినో హ్యుందాయ్ మోటార్స్ తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇప్పటికే ఎన్నో కార్ల తయారీ సంస్థలు ఈ సెగ్మెంట్లో తమ ఉత్పత్తులను విడుదల చేశాయి. యుటిలిటి వాహనాల మీద దృష్టిసారించిన హ్యుందాయ్ కార్లినో ద్వారా తన జాతకాన్ని పరీక్షించుకోనుంది. కార్లినో విపణిలోకి విడుదలైతే ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు అతి త్వరలో విడుదల కానున్న టాటా నెక్సాన్ లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Hyundai Carlino India Launch Details Revealed
Story first published: Wednesday, August 23, 2017, 18:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark