భారత్‌లోకి హ్యుందాయ్ ట్రక్కులు మరియు బస్సులు

Written By:

దేశీయ ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోని వాణిజ్య వాహన రంగంలోకి ప్రవేశించే ఆలోచనలో ఉంది. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో చిన్న మరియు భారీ వాణిజ్య వాహనాలను విడుదల చేసే ఆలోచనలో ఉంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
వాణిజ్య వాహన పరిశ్రమలోకి హ్యుందాయ్

దేశీయంగా వాహన పరిశ్రమలోకి ప్రవేశించడాన్ని ఇప్పటికే హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ వైకె కూ స్పష్టం చేశాడు. మార్కెట్ సామర్థ్యం మరియు వ్యాపార భాగస్వాములతో పాటు వాణిజ్య వాహనాలకు ఉన్న డిమాండ్ వంటి విషయాల గురించి అధ్యయనం చేయడానికి హ్యుందాయ్ కమర్షియల్ వెహికల్ డివిజన్ బృందం జూన్‌ 2017 లో దేశీయంగా పర్యటించింది.

Recommended Video
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
వాణిజ్య వాహన పరిశ్రమలోకి హ్యుందాయ్

ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్న హ్యుందాయ్ డీలర్లు, కమర్షియల్ వాహనాల వాహనాల వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి సముఖంగా ఉన్నారు. అయితే, కమర్షియల్ వెహికల్ డివిజన్‌లోకి ప్యాసింజర్ కార్ల విభాగం కలవడం మంచిది కాదని వైకె కూ పేర్కొన్నాడు.

వాణిజ్య వాహన పరిశ్రమలోకి హ్యుందాయ్

డిసెంబర్ 2016 లో ప్రపంచ వ్యాప్తంగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కార్యకలాపాలు విసృతం చేయాలని హ్యుందాయ్ భావించింది. అందులో ఇండియాన్ మార్కెట్ మీద అధిక ఆసక్తితో ఉన్నట్లు తెలిపింది. అంతే కాకుండా వాణిజ్య వాహన ప్రొడక్షన్ ప్లాంటును ఏర్పాటు చేసే ప్రణాళికల్లో కూడా హ్యుందాయ్ ఉంది.

వాణిజ్య వాహన పరిశ్రమలోకి హ్యుందాయ్

డైమ్లర్ ఇండియా భారత్ బెంజ్ కమర్షియల్ వాహనాలను ఇండియాలో ఉత్పత్తి చేసి, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇదే విధంగా హ్యుందాయ్ కూడా తమ కమర్షియల్ వెహికల్స్‌ను ఇండియాలోనే ఉత్పత్తి చేసి, దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేయనుంది.

వాణిజ్య వాహన పరిశ్రమలోకి హ్యుందాయ్

ఇండియాలో ప్రీమియమ్ బస్సులు మరియు ట్రక్కులను ఉత్పత్తి చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు వోల్వో, స్కానియా, డైమ్లర్ మరియు MAN వంటి దిగ్గజాల సరసన హ్యుందాయ్ కమర్షియల్ విభాగం చేరనుంది.

వాణిజ్య వాహన పరిశ్రమలోకి హ్యుందాయ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత వాణిజ్య వాహన విభాగం దేశీయ సంస్థలైన టాటా మోటార్స్ మరియు ఆశోక్ లేలాండ్ అదే విధంగా చిన్న వాణిజ్య వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఆధానంలోనే ఉంది. కాబట్టి చిన్న మరియు భారీ పరిమాణంలో ఉన్న కమర్షియల్ వాహనాలను ఉత్పత్తి చేయనుండటంతో దేశీయ సంస్థల నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది.

English summary
Read In Telugu; Hyundai Looking To Enter Commercial Vehicle Segment In India
Story first published: Wednesday, August 2, 2017, 11:26 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark