వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ ఎస్‌యువి

Written By:

దేశీయ విపణిలో రెండవ అతి పెద్ద ఎస్‌యువి వాహనాల తయారీ సంస్థగా ఎదగడానికి హ్యుందాయ్ మోటార్స్ పలు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సబ్ కాంపాక్ట్ ఎస్‌యువిలో తనదైన ముద్ర వేసుకోవడానికి వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తోంది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

హ్యుందాయ్ యొక్క ఈ సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువికి క్యుఎక్స్ఐ అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసింది. ప్రస్తుతం తమ లైనప్‌లో ఉన్న క్రెటాకు దిగువ స్థానంలో దీనిని ప్రవేశపెట్టనుంది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

ఎస్‌యువి సెగ్మెంట్లో అధిక ఉత్పత్తులను ప్రవేశపెట్టడం మీద దృష్టిసారించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కాంపాక్ట్ ఎస్‌యువిని సుమారుగా పది లక్షల రుపాయల ప్రారంభ ధరతో విడుదల చేయనున్నారు.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద హెచ్‌ఎన్‌డి -14 కార్లినో కాన్సెప్ట్ ను ప్రదర్శించింది. హ్యుందాయ్ వారి భవిష్యత్ కాంపాక్ట్ ఎస్‌యువిని కూడా దీనిని రూపొందించిన ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేయనున్నారు.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

హ్యందాయ్ వారి ఐ30 హ్యాచ్‌బ్యాక్ మరియు టక్సన్ ఎస్‌యువిల డిజైన్ ప్రేరణతో భవిష్యత్ కాంపాక్ట్ ఎస్‌యువిని డిజైన్ చేస్తోంది హ్యుందాయ్.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

నిర్మాణ కోసం ఐ10 వేదికను వినియోగించుకునే ఇందులో ఐ20 మరియు క్రెటా లలో వినియోగించిన అనేక విడి భాగాలను గ్రహించనుంది. ఇంజన్ పరంగా ఐ20 లోని ఇంజన్‌లతో పాటు అదనంగా 1-లీటర్ సామర్థ్యం గల టర్బో చార్జ్‌డ్ ఇంజన్‌తో రానుంది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

అప్ కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువిలో వినియోగించనున్న 1.0-లీటర్ ఇంజన్ గరిష్టంగా 118బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. ప్రస్తుతం ఉన్న కాంపాక్ట్ ఎస్‌యువిల కన్నా ఇది కాస్త శక్తివంతమైనది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

ఇందులో పరిచయం చేయనున్న మూడు సిలిండర్ల టుర్బో చార్జ్‌డ్ ఇంజన్‌ను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తున్న ఐ20 మోడల్‌లో కలదు.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

హ్యుందాయ్ మోటార్స్ 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ గల కారును విడుదల చేయనున్నట్లు ఇప్పటికే పలుసూచనలిస్తోంది. కాబట్టి, ఈ అప్‌కమింగ్‌ ఎస్‌యువి కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో పరిచయం కానుంది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

హ్యుందాయ్ మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి తమ వాహనాన్ని విడుదల చేస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మరియు మహీంద్రా టియువి300 లకు గట్టి పోటీనివ్వనుంది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ

12,000 కిమీల దూరం ప్రయాణించే లండన్-చైనా రైలు ప్రారంభం....

చైనా నుండి సుమారుగా 12,000 కిలోమీటర్ల దూరం గల లండన్‌కు గూడ్స్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మార్గంలో అనేక దేశాలతో చైనా వాణిజ్య వ్యాపారాలను సాగించనుంది.

టయోటా మోటార్స్ 2017 ఫార్చ్యూనర్ ను విడుదల చేసింది. చివరి జనరేషన్ ఫార్చ్యూనర్ ఎస్‌యువికి డిజైన్ పరంగా భారీ మార్పులు చేర్పులు చేసిన ఈ సెకండ్ జనరేషన్ మోడల్ ఇప్పుడు భారీగా అమ్ముడుపోతోంది. మీరు ఓ సారి చూడండి....

 

English summary
Hyundai's Upcoming Compact SUV Codenamed As QXi; To Take On Vitara Brezza
Please Wait while comments are loading...

Latest Photos