TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మార్పులు చేర్పులతో అప్‌డేటెడ్ హ్యుందాయ్ క్రెటా విడుదల
హ్యుందాయ్ మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ క్రెటా ను సరికొత్త కలర్ ఆప్షన్స్, ఇంటీరియర్ మరియు స్వల్ప మార్పులతో విడుదల చేసింది. రెనో అతి త్వరలో క్యాప్చర్ ఎస్‌యూవీని విడుదల చేయనున్న నేపథ్యంలో హ్యుందాయ్ తమ క్రెటాలో సరికొత్త అప్‌డేట్స్ నిర్వహించింది.
హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు సరికొత్త ఎర్త్ బ్రౌన్ కలర్ స్కీములో కూడా లభించనుంది. ఈ పెయింట్ జాబ్ సింగల్ మరియు డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్లలో కూడా లభిస్తోంది.
కొత్తగా పరిచయమైన కలర్‌తో పాటు మరో ఏడు రకాల కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అవి, పోలార్ వైట్, స్లీక్ సిల్వర్, స్టార్ డస్ట్ మైస్టిక్ బ్లూ, రెడ్ ప్యాసన్, ఫాంటమ్ బ్లాక్ మరియు పోలార్ వైట్ విత్ ఫాంటమ్ బ్లాక్.
సరికొత్త కలర్ ఆప్షన్ జోడింపుతో పాటు నూతన ఇంటీరియర్‌ను కూడా పరిచయం చేసింది. ఎస్ఎక్స్ ప్లస్ డ్యూయల్ టోన్ వేరియంట్లో అప్‌డేటెడ్ లగ్జరీ బ్రౌన్ ప్యాక్ బీజి ఫ్యాబ్రిక్ సీట్లు, బ్రౌన్ ఇన్సర్ట్స్ మరియు కాంట్రాస్ట్ స్ట్రిచ్చింగ్ వంటి ప్రీమియమ్ ఇంటీరియర్ కలదు.
అప్‌డేటె హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్‌లో లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, బ్రౌన్ కలర్ తొడుగు గల గేర్‌నాబ్ ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. వీటితో పాటు అప్‌డేటెడ్ ఇంటీరియర్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్ మినహాయిస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. డీజల్ వెర్షన్ క్రెటాలో 1.6-లీటర్ మరియు 1.4-లీటర్ ఇంజన్‌లు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ క్రెటాలో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. అన్ని వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హ్యుందాయ్ క్రెటా ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఎన్నో మోడళ్లు ఉన్నప్పటికీ, క్రెటా ధర వాటి కంటే అధికంగా ఉన్నా కూడా అత్యుత్తమ సేల్స్ సాధిస్తోంది.
ఈ మధ్య కాలంలో హ్యుందాయ్ క్రెటాకు పోటీ రోజు రోజుకీ పెరుగుతోంది. దీనికి తోడు కొన్ని కొత్త మోడళ్లు బరిలోకి దిగనున్నాయి. ప్రత్యేకించి రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ విడుదల కానున్న నేపథ్యంలో కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా క్రెటాలో మార్పులు చేర్పులు చేసి అప్‌డేట్స్ నిర్వహించింది.