గ్రాండ్ ఐ10లో సరికొత్త డీజల్ ఇంజన్ ఆప్షన్

Written By:

దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాదిలో ఆలస్యంగా తమ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను ఫేస్‌లిప్ట్ రూపంలో విడుదల చేయనుంది. అయితే ఇందులో ప్రస్తుతం ఉన్న డీజల్ ఇంజన్ స్థానంలో నూతన డీజల్ ఇంజన్ పరిచయం కానుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యందాయ్ మోటార్స్ తమ గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లో నూతన డీజల్ ఇంజన్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఉన్న 1.1-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ స్థానంలోకి 1.2-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ రానుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ప్రస్తుతం గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లో 1.1-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ (CRDi) డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్ మరియు 160ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ట్రాన్స్‌మిషన్ పరంగా పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ అదే విధంగా డీజల్ యూనిట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభిస్తున్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

డీజల్ ఇంజన్‌ యొక్క సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇంజన్ యొక్క పవర్ మరియు టార్క్ మెరుగుపడే అవకాశం ఉంది. నూతన డీజల్ ఇంజన్ పరిచయంతో 4బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ టార్క్ పెరిగే అవకాశం ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

సరికొత్త ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ ఐ10 ఎక్ట్సీరియర్ పరంగా కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకునే అవకాశంతో పాటు ఇంటీరియర్‌లో కూడా కొన్ని అదనపు ఫీచర్లు రానున్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

అంతర్జాతీయ మోడల్ ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ ఐ10 లో గుండ్రటి ఆకారంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన పగటి పూట వెలిగే లైట్లు రానున్నాయి. దేశీయంగా విడుదలయ్యే మోడల్‌లో మాత్రం, బార్ టైపులో ఉన్న పగటి పూట వెలిగే లైట్లు ఫాగ్ లైట్లలో ఇముడింపచేయబడి ఉంటాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్స్‌కు అత్యుత్తమ విక్రయాలు సాధించిపెడుతున్న గ్రాండ్ ఐ10 లోని టాప్ ఎండ్ వేరియంట్లో తాకే తెర గల ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ అందివ్వనుంది. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 కార్లు అంతర్జాతీయ విపణికి కూడా ఎగుమతి అవుతున్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో పోటీ పెరిగిన నేపథ్యంలో ప్రెష్ లుక్ ఉత్పత్తులను అందించేందుకు గాను గ్రాండ్ ఐ10 ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో మిగతా ఉత్పత్తులను ఎదుర్కునే విధంగా అభివృద్ది చేస్తోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యాచ్‌బ్యాక్ ను కొనే ఆలోచనలో ఉన్నారా....? మారుతి అతి త్వరలో 2017 స్విఫ్ట్‌ను విడుదల చేయనుంది. దీనికి కోసం వేచి ఉండండి....!! 2017 స్విప్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు....

 
English summary
Hyundai Grand i10 To Get New Diesel Model — Here Are The Details
Please Wait while comments are loading...

Latest Photos