మారుతి స్విఫ్ట్‌ కాదని గ్రాండ్ ఐ10 కారును అధికంగా ఎంచుకుంటున్నారు

Written By:

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా రికార్డుల సృష్టించిన మారుతి స్విఫ్ట్ ప్రభావం మార్కెట్ మీద కొద్దికొద్దిగా తగ్గుతోంది. మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ సేల్స్ ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

గత రెండు నెలలుగా నమోదైన కార్ల విక్రయాలను పరిశీలిస్తే, మీరు కూడా అవుననే అంటారు. గడిచిన రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 28,516 యూనిట్ల గ్రాండ్ ఐ10 కార్లు అమ్ముడయ్యాయి. ఇదే కాలంలో 25,250 స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి.

Recommended Video - Watch Now!
[Telugu] Tata Tiago XTA AMT Variant Launched In India - DriveSpark
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

గత ఆరు నెలల విక్రయాలను పరిశీలిస్తే, దిగ్గజ ప్యాసింజర్ కార్ల సంస్థ మారుతితో పోల్చుకుంటే హ్యుందాయ్ ముందంజలో ఉంది. చివరి ఆరు నెలల కాలంలో 78,125 గ్రాండ్ ఐ10 కార్లను హ్యుందాయ్ విక్రయించగా, ఇదే కాలంలో మారుతి 78,053 యూనిట్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందిన స్విఫ్ట్ ఓ సాధారణ మోడల్‌తో పోటీ వెనక్కి తగ్గింది. స్విఫ్ట్‌ను కాదని గ్రాండ్ ఐ10 కారును ఎక్కవ మంది ఎంచుకుంటున్నారు. అసలు స్విఫ్ట్‌తో పోల్చుకుంటే గ్రాండ్ ఐ10 ఎంపిక ఎందుకు ఉత్తమమో చూద్దాం రండి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

మార్కెట్ మొత్తం ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ల మీద నడుస్తోంది. అయితే, స్విఫ్ట్ లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న బడ్జెట్ మోడల్ గ్రాండ్ ఐ10. హ్యుందాయ్ ఇందులో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

కాకపోతే, మారుతి సుజుకి తమ అప్ కమింగ్ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందివ్వడానికి సిద్దమవుతోంది. అయితే, ఇది విడుదలవ్వడానికి మరో ఆరు నెలల సమయం పట్టనుంది. దీంతో చాలా మంది స్విఫ్ట్ కస్టమర్లు గ్రాండ్ ఐ10 వైపు మొగ్గుచూపుతున్నారు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ రాక...

నిజమే, చాలా మంది స్విఫ్ట్ కస్టమర్లు ప్రస్తుతం ఉన్న మోడల్ మీద ఆసక్తి చూపకపోవడానికి కారణం అప్ కమింగ్ స్విఫ్ట్. మారుతి అతి త్వరలో తమ స్విఫ్ట్‌లో భారీ మార్పులు చేర్పులు చేసి నెక్ట్స్ జనరేషన్ మోడల్‌గా విడుదల చేయనుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ప్రస్తుతం ఉన్న డిజైన్ సుమారుగా ఐదేళ్ల నుండి అలాగే ఉంది. ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీనికి తోడు వ్యక్తిగత అవసరాలకు మరియు కుటుంబ అవసరాలకు ఎక్కువ ఎంచుకుంటుండంతో న్యూ స్విఫ్ట్ కోసం కస్టమర్లు వేచి ఉన్నారు. ప్రస్తుత మోడల్ స్విఫ్ట్ సేల్స్ తగ్గడానికి ఇదీ ఒక కారణం.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ఇంటీరియర్ స్పేస్ మరియు రియర్ ఏ/సి వెంట్స్

గ్రాండ్ ఐ10 పోల్చుకుంటే స్విఫ్ట్ డ్రైవింగ్ చాలా ఫన్‌గా ఉంటుంది. చూడటానికి స్విఫ్ట్ బాడీ పెద్దగా ఉన్నప్పటికీ ఇంటీరియర్‌తో పోల్చుకుంటే గ్రాండ్ ఐ10 ఇంటీరియర్ సౌకర్యవంతంగా ఉంటుంది. అంతే కాకుండా రియర్ సీట్ ప్యాసింజర్స్ సౌకర్యం కోసం రియర్ ఏ/సి వెంట్స్ ఇందులో ఉన్నాయి.

సాధారణంగా రియర్ సీటులో సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారు ఖచ్చితంగా హ్యుందాయ్ గ్రాండ్10 కారునే ఎంచుకుంటారు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

అద్దె కార్ల కోసం

స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ అద్దె కారుగా విపణిలో బాగానే చెలామణీ అవుతోంది. ఓలా మరియు ఉబెర్ అద్దె కార్ల సంస్థలకు గ్రాండ్ ఐ10 కారునే ఎక్కుగా ఎంచుకుంటున్నారు. గ్రాండ్ ఐ10 సేల్స్ పెరగడానికి ఇదీ ఒక కారణమని చెప్పవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా నిలిచిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో నుండి మారుతి నుండి గట్టి పోటీని ఎదుర్కుంటోంది. దీనికి తోడుగా మారుతి కొత్త మోడళ్లను ప్రవేశపెడుతుండటంతో హ్యుందాయ్ సేల్స్ స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, నాణ్యతకు పేరుగాంచిన కార్లను ఉత్పత్తి చేస్తోందన్న పేరుతో రెండవ స్థానంలో నిలుస్తోంది.

English summary
Read In Telugu: Hyundai Grand i10 Outsells the Maruti Swift
Story first published: Tuesday, November 14, 2017, 19:05 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark