బాలెనోకు పోటీగా i20 స్థానంలో i20 N హ్యాచ్‌బ్యాక్ తీసుకురానున్న హ్యుందాయ్ మోటార్స్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ తమ ఎన్ బ్రాండ్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచ విపణిలో విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. హ్యుందాయ్ ఇప్పటి వరకు N బ్రాండ్‌కు చెందిన ఒక్క మోడల్‌ను కూడా ప్రవేశపెట్టలేదు.

అయితే, ఇప్పుడు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఇతర మోడళ్ల నుండి ఎదురవుతున్న పోటీనీ ఎదుర్కునేందుకు ఎన్ బ్రాండ్ హ్యుందాయ్ ఐ20 కారును సిద్దం చేస్తోంది.

హ్యుందాయ్ ఐ20 ఎన్

2018 నాటికి ఐ20 ఎన్ హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయ విపణిలోకి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, హ్యుందాయ్ వెలాస్టర్ ఎన్ మోడల్‌ను అభివృద్ది చేసిన తరువాత ఐ20 ఎన్ మోడల్‌ అభివృద్ది పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.

హ్యుందాయ్ ఐ20 ఎన్

హ్యుందాయ్ వారి అన్ని ఎన్ మోడల్స్ కన్నా ఐ20 ఎన్ కారుకే అధిక ప్రాధాన్యమిస్తోంది. ఐ20 కూపే డబ్ల్యూఆర్‌సి కారును FIA వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో ఉపయోగించింది. కాబట్టి ఐ20 కారునే ఎన్ మోడల్‌గా ప్రవేశపెట్టడానికి సుముఖంగా ఉంది హ్యుందాయ్.

హ్యుందాయ్ ఐ20 ఎన్

హ్యుందాయ్ మోటార్స్ ఎన్ డివిజన్ డైరెక్టర్ ఆల్‌బర్ట్ బిర్మన్ మాట్లాడుతూ, "సి-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌కి మాత్రం ఎందుకు పరిమితం కావాలి? ఈ సెగ్మెంట్లో పోలో జిటిఐ, ఫియస్టా ఎస్‌టి, ప్యూజో 208, మరియు టయోటా యారిస్ వంటివి ఉన్నాయి. ఇలాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. అందుకే ఐ20 హ్యాచ్‌ను ఐ20 ఎన్ బ్రాండ్‌తో కూడా పరిచయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు."

హ్యుందాయ్ ఐ20 ఎన్

హ్యుందాయ్ ఐ20 ఎన్ కారులో 200బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్డ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ట్రైన్‌తో రానున్న ఇందులోని టాప్ ఎండ్ వేరింయట్లో ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ రానుంది.

హ్యుందాయ్ ఐ20 ఎన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొరియన్ కార్ల కంపెనీ అయిన హ్యుందాయ్‌కి ఐ20 మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది. దీని ఆధారంగా రానున్న ఎన్ వేరియంట్ ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో ఉన్న ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి, వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ మరియు టయోటా యారిస్ జిఆర్ఎన్ఎమ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Hyundai i20 N In The Works; To Arrive In 2018

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark