2017 ఫిబ్రవరిలో విడుదలకు సిద్దమైన గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్

Written By:

భారత దేశపు రెండవ అతి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ వచ్చే ఫిబ్రవరి 2017 నాటికి గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ ఫేస్‌లిఫ్టెడ్ గ్రాండ్ ఐ10 లోని ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.

2017 ఫిబ్రవరిలో విడుదల కానున్న గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ 2016 లో జరిగిన ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది.

2017 గ్రాండ్ ఐ10 వేరియంట్‌ను రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పలుమార్లు పరీక్షించింది. అయితే డిజైన్ మరియు ఎక్ట్సీరియర్ అంశాలకు సంభందించిన వివరాలు లీక్ అవ్వకుండా జాగ్రత్తపడింది హ్యుందాయ్.

విడుదలకు సరిగ్గా నాలుగు నెలల క్రితం గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను 2017 నాటికి ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా స్వల్ప మార్పులు మినహాయించి సాంకేతికంగా ఏ విధమైన మార్పులకు గురవ్వడం లేదు.

ఎక్ట్సీరియర్ పరంగా ఇందులో స్పోర్టివ్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే లైట్లు, ముందు మరియు వెనుక వైపున సరికొత్త బంపర్, అదే విధంగా వెనుక వైపున నూతన శైలిలో ఉన్న టెయిల్ ల్యాంప్ క్లస్టర్ రానుంది. అయితే ఆకృతి పరంగా అవే హెడ్ లైట్లతో రానుంది.

2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ స్పోర్టి ఫాగ్ ల్యాంప్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లతో పాటు నూతన రంగుల్లో ఉన్న ఇంటీరియర్ మరియు స్వల్ప అప్‌డేట్స్ గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో రానుంది.

సాంకేతికంగా ఈ మోడల్‌లో 1.2-లీటర్ కప్పా పెట్రోల్ మరియు 1.1-లీటర్ మూడు సిలిండర్ల యు2 విజిటి మోటార్ ఇంజన్‌తో రానుంది. వీటిలో కేవలం పెట్రోల్ వేరియంట్ మాత్రమే 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

2017 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుతం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఫిగో, షెవర్లే బీట్ మరియు టాటా టియాగో వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది.

2017 హ్యుందాయ్ లైనప్‌లోకి ఈ మోడల్ విడుదల ద్వారా అమ్మకాలు స్వల్ప మేరకు వృద్ది చెందే అవకాశం ఉంది. గత డిసెంబర్ 2016 లో దేశీయ విక్రయాల్లో 4.3 శాతం వృద్దిని కోల్పోయింది.

చైనాకు రష్యా అత్యాధునిక ఫైటర్ జెట్ సుఖోయ్ 35: భారత్ పరిస్థితి ఏంటి ?
గత ఏడాది చైనా ఏవియేషన్ ప్రదర్శన వేదిక మీద తమ శక్తివంతమైన జె 20 పైటర్ జెట్ ను ప్రదర్శించింది. అయితే రష్యా అత్యంత శక్తివంతమైన తమ ఐదవ తరానికి చెందిన ఎస్‌యు-35 ఫైటర్ జెట్‌లను చైనాకు డెలివరీ ఇచ్చింది.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ ఎస్‌యువి
హ్యుందాయ్ మోటార్స్ తమ అప్‌‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి మీద పనిచేస్తోంది. దీనికి క్యుఎక్స్ఐ అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

 

2017 మారుతి సుజుకి ఇగ్నిస్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోలు....
 

English summary
Hyundai Motor India To Launch Grand i10 Facelift In February 2017
Story first published: Wednesday, January 4, 2017, 17:28 [IST]
Please Wait while comments are loading...

Latest Photos