ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించిన హ్యుందాయ్

Written By:

గతంలో హ్యుందాయ్ దిగ్గజం 2010 లో ఎలక్ట్రిక్ బస్సును ప్రదర్శించింది. అయితే అది ప్రయోగ దశలోనే నిలిచిపోయి ప్రొడక్షన్ దశకు చేరుకోవడంలో విఫలం అయ్యింది.

ఎలక్ట్రిక్ బస్సుల సాంకేతికతలో అనేక ప్రయోగాలు చేసుకుంటూ మరో ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించి హ్యుందాయ్ ట్రక్ అండ్ బస్ మెగా ఫెయిర్‌లో ప్రదర్శించింది. హ్యుందాయ్ ప్రదర్శించిని ఈ బస్సుకు 'ఎలెక్ సిటి' అనే పేరు పెట్టింది.

ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించిన హ్యుందాయ్

2018 ప్రారంభ నాటికి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ మరియు విక్రయాలను ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తోంది. సాంకేతికంగా తమ ఎలెక్ సిటి బస్సులో 256కెడబ్ల్యూహెచ్ లిథియమ్ అయాన్ పాలిమర్ బ్యాటరీ కలదు. దీని పరిధి గరిష్టంగా 290కిలోమీటర్ల వరకు ఉంది.

ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించిన హ్యుందాయ్

చక్రాలు కదలడానికి కావలసిన పవర్ మరియు టార్క్ 240కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ నుండి అందుతుంది. హ్యుందాయ్ అభివృద్ది చేసిన ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా కేవలం 67 నిమిషాలలోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించిన హ్యుందాయ్

ఇంధన వినియోగంతో నడిచే బస్సుల నిర్వహణ వ్యయంలో కేవలం మూడవ వంతు ఖర్చుతో ఈ ఎలెక్ సిటి ఎలక్ట్రిక్ బస్సులను నడపవచ్చని హ్యుందాయ్ పేర్కొంది. దీంతో ఇంధన వినియోగం తగ్గి, ఖర్చులు తగ్గుముఖం పట్టి ఆదాయం పెరగడంతో పాటు పర్యావరణానుకూలం అని కూడా తెలిపింది.

ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించిన హ్యుందాయ్

ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు మరియు బైకుల్లో బ్యాటరీ ఛార్జింగ్ సమయంలో అధిక ఛార్జ్ అయినపుడు మరియు ఛార్జింగ్ అయ్యే సమయంలో బ్యాటరీలు అధిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సమస్యను నివారించడానికి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్‌ను అభివృద్ది చేసి తమ ఎలెక్ సిటి విద్యుత్ బస్సుల్లో అందించింది హ్యుందాయ్.

ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించిన హ్యుందాయ్

సాంకేతిక విషయాలను ప్రక్కనపెడితే, హ్యుందాయ్ ఎలెక్ సిటి విద్యుత్ బస్సుల ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్ ప్రజా రవాణాకు అద్దం పడుతోంది. వాణిజ్యపరమైన అవసరాలకు అనుగుణమైన బస్సులలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ ఆవిష్కరణలో హ్యుందాయ్ మోటార్స్ ముందడగు వేసిందని స్పష్టంగా చెప్పవచ్చు.

ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించిన హ్యుందాయ్

ఇంటీరియర్‌లో ప్రయాణికుల భద్రతకు మరియు సమాచార సేవలకు హ్యుందాయ్ పెద్ద పీట వేసింది. బస్సు భాహ్య వైపు నలుమూలలా వీక్షించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ మరియు కలర్ డిజిటల్ క్లస్టర్ కలదు.

English summary
Read In Telugu To Know More About Hyundai Reveals All-Electric Bus In Korea
Story first published: Tuesday, June 6, 2017, 12:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark