TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
విడుదలకు సిద్దమైన ఈ చిన్న కారు గురించి పూర్తి వివరాలు వెల్లడించిన హ్యుందాయ్
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్ కోసం చిన్న కారును తయారు చేస్తోంది. శాంట్రో లక్షణాలతో కూడా పూర్తి స్థాయి సరికొత్త చిన్న కారును అభివృద్ది చేస్తున్న హ్యుందాయ్ పేర్కొంది.
ఈ విశయమై హ్యుందాయ్ ఇండియా మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మరియు గ్రూపు హెడ్ పునీత్ ఆనంద్ స్పందిస్తూ, "కంపెనీ తమ తదుపరి చిన్న కారు కోసం శాంట్రో బ్రాండ్ పేరును వినియోగించబోదని" తెలిపాడు.
వెర్నా విడుదల సందర్భంగా, హ్యుందాయ్ నూతన కాంపాక్ట్ కారును అభివృద్ది చేస్తున్నట్లు మరియు దీనిని 2018 ఏడాది మలిసగంలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ వెల్లడించింది. అయితే, హ్యుందాయ్ శాంట్రో బ్రాండ్ పేరుతో చిన్న కారును ప్రవేశపెడుతుందని గతంలో అనేక వార్తలొచ్చాయి.
"హ్యుందాయ్ నెక్ట్స్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు నిజానికి శాంట్రో పేరుతోనే రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం మార్కెట్ దృష్టా మరియు పలు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని శాంట్రో కాకుండా కొత్త పేరును ఇందుకు ఖరారు చేయనున్నట్లు" ఆనంద్ చెప్పుకొచ్చాడు.


తరువాత హ్యుందాయ్ హాచ్‌బ్యాక్ సాంకేతింకగా 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇదే ఇంజన్ ప్రస్తుతం గ్రాండ్ 10లో కూడా కలదు. అయితే, ఇందులో ప్రధానంగా గుర్తించదగిన అంశం హ్యుందాయ్ అభివృద్ది చేస్తున్న ఆటోమేటిక్ గేర్‌బాక్స్.
డిజైన్ పరంగా చూస్తే, తరువాత హ్యుందాయ్ చిన్న హ్యాచ్‌బ్యాక్ కారుని అధిక క్యాబిన్ స్పేస్ మరియు లగేజ్ స్పేస్‌తో శాంట్రో కన్నా విశాలంగా మరియు పొడువుగా రూపొందిస్తోంది. ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి కొద్దిగా క్రాసోవర్ డిజైన్ లక్షణాలతో కూడా రానుంది.
హ్యుందాయ్ అప్ కమింగ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు ప్రస్తుతం ఉన్న ఇయాన్ మరియు గ్రాండ్ ఐ10 మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది. చిన్న కారుతో పాటు, 2019 నాటికి మార్కెట్లో ఉన్న వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లకు పోటీగా కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఆధునిక ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో హాటు కేకుల్లా అమ్ముడుపోతున్న అన్ని రకాల చిన్న కార్లకు గట్టి పోటీనివ్వనుంది. ప్రస్తుతం భారీ విక్రయాలు జరుపుతున్న టాటా టియాగో మరియు మారుతి సెలెరియో లకు ప్రధాన పోటీగా నిలవనుంది. ఈ కారు రూ. 4 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.