హోండా సిటి, మారుతి సియాజ్ లను మట్టికరిపించిన హ్యుందాయ్ వెర్నా

Written By:

హ్యుందాయ్ మోటార్స్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన వెర్నా సెడాన్ సెగ్మెంట్లో టాప్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఇదే సెగ్మెంట్లో ఉన్న హోండా సిటి మరియు మారుతి సుజుకి సియాజ్ కార్ల కన్నా ఎక్కువ సేల్స్ సాధించింది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

గడిచిన సెప్టెంబరు 2017 లో 6,010 యూనిట్ల హోండా సిటి కార్లు మరియు 5,603 యూనిట్ల మారుతి సియాజ్ కార్లు అమ్ముడయ్యాయి. ఇదే కాలంలో హ్యుందాయ్ 6,053 యూనిట్ల వెర్నా కార్లను విక్రయించింది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

విడుదలైన కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెర్నా మీద 15,000 లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. మరో రెండు మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. హ్యుందాయ్ వెర్నా సెడాన్‌ను రూ. 8 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

అంతే కాకుండా వెర్నాలో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను పరిచచయం చేసే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే మరింత తక్కువ ధరకే వెర్నా అందుబాటులోకి రానుంది. దీంతో సేల్స్ పుంజుకునే అవకాశం ఉంది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

ప్రస్తుతం హ్యుందాయ్ వెర్నా 2.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్ 121బిహెచ్‌పి పవర్ మరియు 151ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ వేరియంట్ 126బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

హ్యుందాయ్ వెర్నా సెడాన్‌ను ఎక్కువ మంది స్టైలిష్ డిజైన్ మరియు లో మెయింటనెన్స్ కారణంగా ఎంచుకుంటున్నారు. అయితే, పవర్‌ఫుల్ వెర్షన్ సెడాన్ కావాలనుకుంటే వెర్నా తీవ్ర అసంతృప్తిని మిగుల్చుతుంది. శక్తివంతమైన సెడాన్ కోసం చూసే వారికి ఫియట్ లీనియా ప్రత్యామ్నాంగా ఉంది.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

ఫీచర్లు మరియు డిజైన్ పరంగా ఫియట్ లీనియా సెడాన్ కస్టమర్లను ఆకట్టుకోలేకపోతోంది. అయితే, శక్తివంతమైన ఇంజన్ కావాలనుకునే సెడాన్ ప్రేమకులకు లీనియా ఉత్తమ ఎంపికే అని చెపప్పవచ్చు.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

ఇక ఇదే సెడాన్ వర్గానికి చెందిన సియాజ్ మరియు సిటి కార్ల విషయానికి వస్తే, పనితీరు విషయంలో వెర్నాతో సమానంగానే ఉంటుంది. అయితే విశాలమైన ఇంటీరియర్ మరియు అత్యుత్త రైడ్ హ్యాండ్లింగ్, స్పీడ్ బ్రేకర్లు మరియు గుంతల గల రోడ్ల మీద మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియెన్స్ కావాలంటే సిటి లేదా సియాజ్ బెస్ట్ చాయిస్.

హ్యుందాయ్ వెర్నా సేల్స్

క్లాసీ లుక్, ప్రీమియమ్ ఫీల్ కల్పించే ఇంటీరియర్ మరియు సెగ్మెంట్ లీడర్ లక్షణాలను వెర్నాను డీసెంట్ కస్టమర్లు అధికంగా ఎంచుకుంటున్నారు. వెర్నా, సిటి, సియాజ్ మరియు లీనియా సెడాన్ కార్లను పైన పేర్కొన్న అంశాలకు అనుగుణంగా మీ డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి ఎంచుకోగలరు. అయితే వీటిలో మీ ఛాయిస్ ఏదో క్రింది కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి.

English summary
Read In Telugu: hyundai verna outsells honda city and maruti ciaz
Story first published: Saturday, October 7, 2017, 12:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark