గోవా పికప్ ట్రక్కును ఆవిష్కరించిన మహీంద్రా

Written By:

భారత దేశపు విభిన్న వాహన తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త గోవా పికప్ ట్రక్కును స్పెయిన్ లోని బార్సిలోనాలో ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఉన్న మహీంద్రా గెట్‌అవే పికప్ ట్రక్కుకు డిజైన్ పరంగా మార్పులు చేసి గోవా పికప్ ట్రక్కుగా ఆవిష్కరించింది.

మహీంద్రా గోవా పికప్ ట్రక్కు

మహీంద్రా గోవా పికప్ ట్రక్కు అత్యంత పదునైన డిజైన్ లక్షణాలతో అగ్రెశివ్ డిజైన్‌లో ఉంది. 2018 నుండి యూరోపియన్ మార్కెట్లో విక్రయాలకు సిద్దం కానుంది. 2018 లోనే కొన్ని నెలల అనంతరం ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.

మహీంద్రా గోవా పికప్ ట్రక్కు

ఈ పికప్ ట్రక్కు ముందు వైపున రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మధ్యలో ఉన్న ఫ్రంట్ గ్రిల్‌లో నిలువుటాకారంలో ఉన్న క్రోమ్ స్లాట్లు ఉన్నాయి.

మహీంద్రా గోవా పికప్ ట్రక్కు

మలచబడిన డిజైన్‌లో ఫ్రంట్ బానెట్, ముందు మరియు వెనుక వైపున రీ డిజైన్ చేయబడిన బంపర్లు, న్యూ డిజైన్‌లో టెయిల్ ల్యాంప్ క్లస్టర్ అదే విధంగా పికప్ ట్రక్కు అనే భావన కలిగించేందుకు స్కిడ్ ప్లేట్లను అందివ్వడం జరిగింది.

మహీంద్రా గోవా పికప్ ట్రక్కు

అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని గోవా పికప్ ట్రక్కులో ఇంటీరియర్ డిజైన్ చేయబడింది. ప్రీమియమ్ ఫీల్ కల్పించేందుకు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 6-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక వైపు ప్యాసింజర్ల కోసం ఏ/సి వెంట్లు ఉన్నాయి.

మహీంద్రా గోవా పికప్ ట్రక్కు

మహీంద్రా గోవా పికప్ ట్రక్కుకు సంభందించిన ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఇండియన్ స్పెక్ గోవా పికప్ ట్రక్కు విషయానికి వస్కే, 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

మహీంద్రా గోవా పికప్ ట్రక్కు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 120బిహెచ్‌పి పవర్ మరియు 290ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది.

English summary
Read In Telugu Mahindra Goa Pickup Truck Revealed
Story first published: Saturday, May 20, 2017, 17:27 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark