ఈ మేడిన్ ఇండియా కారు ఆ దేశంలో మూడవ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది

Written By:

వోక్స్‌వ్యాగన్ ఇండియా విభాగం మరో అరుదైన మైలురాయిని సాధించింది. ఇప్పటి వరకు వోక్స్‌వ్యాగన్ ఉత్పత్తి చేసిన 2,50,000 యూనిట్ల మేడిన్ ఇండియా కార్లను మెక్సికోకు ఎగుమతి చేసింది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా ఎడమ చేతి వైపు స్టీరింగ్ వీల్ ఉన్న పోలో మరియు వెంటో కార్లను దేశీయంగా ఉత్పత్తి చేసి మెక్సికోకు ఎగుమతి చేస్తోంది. అధిక డిమాండ్ నేపథ్యంలో గత కొన్నేళ్ల నుండి ఎగుమతులు విపరీతంగా పెరిగాయి.

వోక్స్‌వ్యాగన్ వెంటో కార్లు మెక్సికోకు ఎగుమతి

ఇండియాలో తయారైన వోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ మెక్సికోలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కారుగా నిలిచింది. మెక్సికో ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అత్యుత్తమ సేల్స్ సాధిస్తున్న నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ ఇండియా విభాగం నిరంతరం వెంటో కార్లను ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు 2,10,000 యూనిట్ల వెంటో కార్లు మెక్సికోలో ఉన్నాయి.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
వోక్స్‌వ్యాగన్ వెంటో కార్లు మెక్సికోకు ఎగుమతి

వోక్స్‌వ్యాగన్ ఇండియా విభాగం ప్రపంచ వ్యాప్తంగా దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియా ఈ నాలుగు ఖండాలలో ఉన్న 35 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ నాలుగు ఖండాలకు 3,10,000 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది.

వోక్స్‌వ్యాగన్ వెంటో కార్లు మెక్సికోకు ఎగుమతి

వోక్స్‌వ్యాగన్ సరిగ్గా 2013లో మెక్సికోకు కార్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పూనేలో ఉన్న వోక్స్‌వ్యాగన్ ప్రొడక్షన్ ప్లాంటు సగానికి పైగా కార్ల ఎగుమతి కోసం ఉత్పత్తి చేస్తోంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో కార్లు మెక్సికోకు ఎగుమతి

మెక్సికో ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఉన్న జెట్టా క్లాసికో కారు స్థానాన్ని వోక్స్‌వ్యాగన్ వెంటో భర్తీ చేసింది. అత్యుత్తమ డిజైన్, నాణ్యమైన శరీర నిర్మాణం, అత్యధిక సేఫ్టీ ఫీచర్లు, సౌకర్యవంతమైన మరియు విశాలమైన క్యాబిన్ స్పేస్ వంటి కారణాలతో మెక్సికన్లకు వెంటో బెస్ట్ కారుగా నిలిచింది.

English summary
Read In Telugu: India-Made Volkswagen Vento Is The 3rd Highest Selling Car In This Country
Story first published: Thursday, July 27, 2017, 20:39 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark