ఒక్క పెట్రోల్ లేదా డీజల్ కారు కూడా ఇండియాలో విక్రయించకూడదు - కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి

Written By:

భారత ప్రభుత్వం యొక్క మరో చిరకాల కోరికను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్ బయటపెట్టారు. పొగను విడుదల చేసే కార్లకు పూర్తి స్థాయిలో స్వస్తి పలికి 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను మాత్రమే అనుమతించాలనే నిర్ణయాన్ని వెలిబుచ్చారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఒక్క పెట్రోల్ లేదా డీజల్ కారు కూడా ఇండియాలో విక్రయించకూడదు

భారతీయ పరిశ్రమ సమాఖ్య(CII) 2017 వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ మాట్లాడుతూ, 2030 నాటికి దేశీయ మార్కెట్లో ఏ ఒక్క పెట్రోల్ లేదా డీజల్ కారు విక్రయించకూడదు అనే దిశగా కేంద్ర నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఒక్క పెట్రోల్ లేదా డీజల్ కారు కూడా ఇండియాలో విక్రయించకూడదు

ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ నిలదొక్కుకునేంత వరకు ఆ యా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలకు భారత ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఈ సమావేశంలో పేర్కొన్నారు.

ఒక్క పెట్రోల్ లేదా డీజల్ కారు కూడా ఇండియాలో విక్రయించకూడదు

ఇందుకు ఉదాహరణగా మారుతి సుజుకి సంస్థను ముందుకుతెచ్చారు. ప్రారంభంలో భారత ప్రభుత్వ చేయూతతో ప్రారంభమైన సంస్థ అంచెలంచెలుగా ఎదిగి దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమను శాసిస్తోందని చెప్పుకొచ్చారు.

ఒక్క పెట్రోల్ లేదా డీజల్ కారు కూడా ఇండియాలో విక్రయించకూడదు

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు నీతి అయోగ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ, ఉత్పత్తి మరియు కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. అందరూ స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలకు మొగ్గుచూపితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు వాటంతట అవే దిగివస్తాయని పేర్కొన్నారు.

ఒక్క పెట్రోల్ లేదా డీజల్ కారు కూడా ఇండియాలో విక్రయించకూడదు

భారీ పన్నులు చెల్లించి, ఇంధననాన్ని దిగుమతి చేసుకుని, ఆ ఇంధనంతో వాహనాలను నడపడం కన్నా... మనం ఉత్పత్తి చేసే విద్యుత్ ద్వారా ఎలాంటి పన్నులు చెల్లించకుండా... విదేశాలకు భారత ధనం మల్లకుండా చేసుకోవడం చాలా ఉత్తమం కదా...

English summary
Read In Telugu Not A Single Petrol Or Diesel Car Should Be Sold In The Country — Piyush Goyal
Story first published: Tuesday, May 2, 2017, 21:19 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark