భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం

Written By:

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు చాలా కామన్ అయిపోయాయి. అయితే, ఇండియాలో మాత్రం కాదు. ఎందుకో తెలుసా...? ఎలక్ట్రిక్ కార్ల వాడకం విరివిగా ఉండాలంటే, ఊరూరా పెట్రోల్ బంకులు వెలసినట్లు, అంతే సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు ఉండాలి.

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

మన దేశంలో ఇప్పటి వరకు ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ లేకపోడం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల మన వెనుకబాటుతనం స్పష్టమవుతోంది. కాలం మారింది, కాలంతో పాటు ఇప్పటి వరకు ఇండియాలో సాధ్యం కానివి ఒక్కొక్కటిగా సాధ్యమవుతున్నాయి. అందులో ఒకటి భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు.

Recommended Video - Watch Now!
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

అవును, దేశీయ దిగ్గజ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC) భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను నాగ్ పూర్‌లోని పెట్రోలియం పంపు వద్ద ఏర్పాటు చేసింది.

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC) దేశీయ దిగ్గజ ట్యాక్సీ దిగ్గజం ఓలా భాగస్వామ్యంలో తమ పెట్రోల్ మరియు డీజల్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పూర్తిస్థాయి ఛార్జింగ్ స్టేషన్‌ను నెలకొల్పింది. విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థ పరిచయం అయిన భారత దేశపు తొలి నగరంగా నాగ్‌‌పూర్ నిలిచింది.

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

భారతదేశపు అతి పెద్ద ఆయిల్ రీఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధికారి మురళి శ్రీనివాసన్ మాట్లాడుతూ, " కాలుష్య రహిత రవాణాను అందించే తమ వ్యాపార ప్రణాళికల్లో భాగంగా ఓలా ట్యాక్సీ దిగ్గజంతో భవిష్యత్ రవాణా వ్యవస్థను మార్చడానికి ముందడగు వేసినట్లు తెలిపాడు."

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

ప్రస్తుతం నగర రవాణాలో ఉన్న కీలక సమస్యలకు ఎలక్ట్రిక్ వాహన రవాణా వ్యవస్థ ఇందుకు చక్కటి పరిష్కారం. వాహన కాలుష్యం, శబ్దం కాలుష్యం వంటి అనర్థాలకు ముగింపు పలుకుతూ ఓలా మరియు IOC భాగస్వామ్యం ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టనుంది.

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

నీతి అయోగ్ ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో ఉన్నసుమారుగా 55 ప్రాంతాల్లో 135 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదించింది. దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి కేంద్రం తీసుకున్న ప్రయత్నంలో ఐఓసి మరియు ఓలా భాగమయ్యింది.

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మరియు ఓలా వంటి దిగ్గజాలు ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలో అడుగుపెడుతున్నాయంటే, భారత ప్రభుత్వం దేశీయంగా సరికొత్త విధి విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్ట్రిక్ వాహన రవాణా మరియు వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది.

English summary
Read In Telugu: India's First Electric Vehicle Charging Station Launched
Story first published: Monday, November 20, 2017, 19:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark