క్షణాల్లో ముగ్గురు ప్రాణాలు బలిగొన్న ఫేస్‌బుక్ లైవ్ వీడియో

Written By:

ఘోర రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలలో పరధ్యానం ఒకటి. శ్రీనగర్‌లో జరిగిన ఓ దుర్ఘటన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పరధ్యానం ఎంత ప్రమాదకరమైనదో చెబుతుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

అసలేం జరిగింది....?

జమ్మూ కాశ్మీరులోని శ్రీనగర్‌ సమీపంలో విశాలమైన రోడ్డు మీద ఆగష్టు 14, 2017 న జరిగిన ఘోరమైన ప్రమాదానికి చెందిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీరులోని ఇతర పర్వత ప్రాంతాలతో పోల్చితే శ్రీనగర్‌లో విశాలమైన రోడ్లు ఉన్నాయి. సువిశాలమైన రోడ్డు మీద మారుతి 800 కారులో నలుగురుప్రయాణిస్తున్నారు.

Recommended Video
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

కారులో డ్రైవర్‌ ప్రక్కన కూర్చున్న తోటి ప్రయాణికుడు ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. ఈ వీడియోలో నలుగురు కూడా సీటు బెల్ట్ ధరించలేదు. అధిక వేగంతో, లౌడ్ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ, డ్రైవర్ కూడా గట్టిగా పాటలు పాడుతూ విశాలమైన రోడ్డు మీద వంకరటింకరగా కారును నడిపాడు.

ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

గరిష్ట వేగంతోనే చిన్న చిన్న రోడ్లను దాటుకుని హై వే మీదకు చేరుకున్నాక, అనేక వాహనాలను ఓవర్ టేక్ చేస్తూ, రోడ్డు ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఎదురుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా కారును అధిగమించే ప్రయత్నం చేశాడు. అయితే అదుపుతప్పిన కారు ప్రమాదానికి గురయ్యి అక్కడ నుండి పల్టీలు కొట్టింది.

ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి రోడ్డు క్రింద వరకు దొర్లుకుంటూ రావడంతో, కారు మొత్తం చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది. ఈ ప్రమాదానంతరం ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించగా, ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు.

ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

రహదారులపై పరధ్యానపు ప్రయాణం

రహదారులపై పరధ్యానం అత్యంత ప్రమాదకరమైనది. భారత రోడ్ల మీద క్షణిక కాలం పాటు పరధ్యానంలో ఉంటే డ్రైవింగ్ చేసే వారితో పాటు ఇతరుల జీవితాలు కూడా అర్దాంతరంగా ఆగిపోతాయి. డ్రైవింగ్ మీద దృష్టిసారించకుండా ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో కనబడేందుకు చేసిన ప్రయత్నంలో ప్రమాదానికి గురైనట్లు వీడియో స్పష్టంగా తెలుస్తోంది. పాశ్చాత దేశాలలో ఇలాంటివి అధికం. అయితే మన దేశంలో ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన తొలి రోడ్డు ప్రమాదం ఇది.

ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

ఇలాంటి ప్రమాదాలను ఎలా నివారించాలి...?

రోడ్డు మీద నుండి దృష్టి మళ్లకుండా ఉంచుకోండి. ఇండియన్ రోడ్ల మీద గుంతలు, జంతులు మరియు పాదచారులు ఉన్నట్లు రోడ్డు మధ్యలోకి వస్తాయి. రోడ్డును నిరంతరం చూస్తూ ఉండటం ద్వారా వేగాన్ని వెంటనే అదుపు చేయవచ్చు.

ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

డ్రైవింగ్‍‌లో ఉన్నపుడు మొబైల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగించకండి.

డ్రైవింగ్‌లో ఉన్నపుడు మొబైల్ ఫోన్లను వినియోగించడం ద్వారా రోడ్డు మీద ధ్యాస తగ్గిపోతుంది. ఇది ఎంతో ప్రమాదకరం

ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

డ్రైవింగ్ చేస్తున్నపుడు మీతోటి ప్రయాణికులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం, మీతో పదే పదే మాట్లాడుతూ డిస్టర్బ్ చేయడం మరియు అధిక శబ్దంతో మ్యూజిక్ ప్లే చేయడం వంటివి చేయవద్దని చెప్పండి.

ఫేస్‌బుక్ లైవ్ వీడియో కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

పరిమిత వేగంతో ప్రయాణించండి

రోడ్ల మీద పరిమిత వేగంతో మాత్రమే ప్రయాణించండి. వేగంగా వెళ్లేకొద్దీ అవరోధానికి స్పందించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రమాదాన్ని దాదాపు ఆపలేము.

సమయానికి గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే, కాస్త ముందుగానే ప్రయాణాన్ని ప్రారంభించి, నిర్ణీత వేగంతో సురక్షితంగా ప్రయాణించి గమ్యాన్ని చేరుకోండి.

English summary
Read In Telugu: Indias First Facebook Live Accident Leaves Three Youth Dead
Story first published: Thursday, August 31, 2017, 15:57 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark