భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న ఆ కారు ఇండియాలో అమ్ముడుపోలేదు

అత్యధికంగా ఎగుమతవుతున్న టాప్ 10 కార్లలో మొదటి స్థానంలో నిలిచిన షెవర్లే బీట్ కారు ఇండియన్ మార్కెట్లో అమ్మకాల్లో లేదు.

By Anil

గత కొన్ని సంవత్సరాల నుండి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలకు భారత్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారిపోయింది. ప్రధాన సంస్థలు తమ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

ఇప్పుడు, అమెరికా దిగ్గజం షెవర్లే ఇండియా నుండి బీట్ కారును విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. 2017-2018 ఆర్థిక సంవత్సరంలోని తొలిసగ భాగంలో అత్యధికంగా ఎగుమతైన కార్లలో షెవర్లే బీట్ నిలిచింది.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

జనరల్ మోటార్స్ ఇండియాలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. ఇండియాలో రెండు ప్రొడక్షన్ ప్లాంట్లలో ఒకదానిని అమ్మేయగా, మరో ప్లాంటులో గ్లోబల్ మార్కెట్‌కు కావలసిన ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేస్తోంది.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

జనరల్ మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో 45,222 యూనిట్ల బీట్ కార్లను ఎగుమతి చేసింది. ఎడమ చేతి వైపు స్టీరింగ్ వీల్ ఉన్న షెవర్లే బీట్ కార్లను పూనే సమీపంలో ఉన్న తాలేగావ్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

Trending On DriveSpark Telugu:

మహీంద్రా & టాటా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్

2018లో మరో సంచలనానికి తెర దించుతున్న మారుతి

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

చీలి, మధ్య అమెరికా, పెరూ మరియు అర్జెంటీనా వంటి దేశాలకు బీట్ కార్లను ఎగుమతి చేస్తోంది. జనరల్ మోటార్స్ కొంత కాలం క్రితం బీట్ ఫేస్‌లిఫ్ట్ మరియు ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ కార్లను పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. అయితే, ఇండియాలో విడుదల చేసే అవకాశం లేకపోవడంతో వీటిని కూడా ఎగుమతుల కోసం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

అత్యధికంగా ఎగుమతి అవుతున్న రెండవ కారు వోక్స్‌వ్యాగన్ వెంటో. జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు త్రైమాసికాలలో 41,430 యూనిట్ల వెంటో సెడాన్ కార్లను ఎగుమతి చేసింది.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

గతంలో ఈ జాబితాలో రెండవ జాబితాలో ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ 39,935 యూనిట్లు మాత్రమే ఎగుమతి కావడంతో మూడవ స్థానానికి పరిమితమైపోయింది.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

ఫోర్డ్ ఇండియా ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటు ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను ఎగుమతి చేస్తోంది. మునుపటితో పోల్చుకుంటే రెండు మోడళ్లు ఎగుమతిలో వృద్దిని సాధించాయి.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

ఫోర్డ్ 2017-18 ఆర్థిక సంవత్సరంలోని తొలి సగభాగంలో 26,331 యూనిట్ల ఫిగో హ్యాచ్‌బ్యాక్ కార్లను మరియు 16,081 యూనిట్ల ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను ఎగుమతి చేసింది.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

ఎగుమతుల జాబితాలో హ్యుందాయ్ క్రెటా మరియు గ్రాండ్ 10 కార్లు వరుసగా ఐదు మరియు ఆరు స్థానాల్లో నిలిచాయి. కొరియా దిగ్గజం హ్యుందాయ్ 25,940 యూనిట్ల క్రెటా, 19,719 యూనిట్ల గ్రాండ్ ఐ10 కార్లను ఎగుమతి చేసింది. అయితే, ఎక్సెంట్ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

గత ఏడాదిలో ఎగుమతుల్లో రెండవ స్థానంలో ఉన్న నిస్సాన్ మైక్రా ఎగుమతులు దారుణంగా పడిపోవడంతో 10 వ స్థానానికి పడిపోయింది. ఇందుకు ప్రధానం కారణం జపాన్ దిగ్గజం తమ తయారీ యూనిట్‌ను ఇండియా నుండి ఫ్రాన్స్‌కు మార్చడం.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

నిస్సాన్ 13,599 యూనిట్ల మైక్రా హ్యాచ్‌బ్యాక్ కార్లను మరియు 13,847 యూనిట్ల సన్నీ(తొమ్మిదవ స్థానంలో నిలిచింది) సెడాన్ కార్లను ఇండియా నుండి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

మారుతి సుజుకి 18,869 యూనిట్ల బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎగుమతి చేసి, మునుపటిలా ఏడవ స్థానంలోనే నిలిచింది.

భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతవుతున్న కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఒక్క నిస్సాన్ మైక్రా ఎగుమతులతో పోల్చుకుంటే దాదాపు అన్ని మోడళ్లు కూడా ఎగుమతిలో అత్యుత్తమ వృద్దిని సాధించాయి. దీంతో భారత ప్రపంచ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలకు మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అవతరించిందని చెప్పవచ్చు.

వీటిలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇండియా నుండి అత్యధికంగా ఎగుమతువున్న కారు ఇండియాలో అమ్ముడవ్వకపోవడం. షెవర్లే దేశీయంగా ఆశించిన ఫలితాలు కనబరచకపోవడంతో శాస్వతంగా కార్యకలాపాలు నిలిపివేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: India’s Most Exported Car Revealed — But It Doesn’t Sell In India!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X