ఇంధన సంక్షోభానికి తెర దించుతూ, సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

Written By:

ప్రపంచ భవిష్యత్ రవాణా సాధనాలుగా ఎలక్ట్రిక్ కార్లు ప్రధాన నిలవనున్నాయి. అయితే ఇక మీదట పెట్రోల్ మరియు డీజల్ కార్లు విడుదల చేసే ఉద్గారాలు ఇక మీదట పొగ గొట్టాలు విడుదల చేస్తాయి. వాహనాల నుండి పూర్తి స్థాయిలో ఉద్గారాలను నియంత్రించే ఏకైక పద్దతి ఎలక్ట్రిక్ కార్లను వినియోగించడమే.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తమ సాంకేతికల పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త వ్యవస్థను రూపొందించింది. దీని ద్వారా కృత్రిమ ఛార్జింగ్ అవసరం లేకుండా నడిచే ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసింది.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

కారు పైభాగంలో అందించిన సోలార్ ప్యానెల్స్ ద్వారా కారులోని లిథియ్ అయాన్ బ్యాటరీలు నిరంతరం ఛార్జ్ అవుతూనే ఉంటాయి. ఈ పపర్ ఎలక్ట్రిక్ మోటార్‌కు సరఫరా అవుతుంది.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సహజ శక్తి వనరుల్లో ఒకటి సోలార్ పవర్. దీని ద్వారా వాతారణ కాలుష్యం జరగదు మరియు ఈ శక్తిని తరిగిపోనిది. కాబట్టి ఇస్రో ఈ సోలార్ పవర్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ కారుకు కావాల్సిన సాంకేతికతను అభివృద్ది చేసింది.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

ఈ ఎలక్ట్రిక్ కారులో సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీ, సూపర్ కెపాసిటర్, వంటి ప్రధాన విడి భాగాలు ఉన్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ కోసం మరియు చక్రాలకు పవర్ సరఫరా చేయడానికి గేర్ వంటి వ్యవస్థలను నియంత్రించేందుకు ప్రత్యేక ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ కలవు.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

అధిక సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెళ్లను ఇస్రో ఈ ఎలక్ట్రిక్ కారులో అందించింది. మరియు ఇందులో ఎక్కువ పవర్ కావాల్సి వచ్చినపుడు పవర్ సేకరించేందుకు సూపర్ కెపాసిటర్ ఏర్పాటు చేశారు.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

కారులోని లిథియమ్ అయాన్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు సోలార్ ప్యానెళ్లను నిరంతరం బ్యాటరీకి పవర్‌ను సరఫరా చేస్తాయి.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

కారు నడవడానికి అవసరమయ్యే ప్రధాన పరికరం తక్కువ బరువున్న బ్రష్‌లెస్ ఎలక్ట్రిక్ మోటార్‌కు బ్యాటరీ పవర్ సరఫరా చేస్తుంది. మారుతి సుజుకి ఆమిని కారును ఇందుకు వినియోగించారు. మొత్తం ఎలక్ట్రిక్ వ్యవస్థను కారు డిక్కీలో అమర్చారు.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

పూర్తి స్థాయిలో అభివృద్ది చేసిన తరువాత ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారును ఇస్రో ప్రయోగాత్మకంగా నడిపి చూపింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కారు నడిచింది.

సోలార్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేసిన ఇస్రో

తక్కువ ధరతో సోలార్ ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, లిథియమ్-అయాన్ సెల్స్/ఫ్యూయల్ సెల్స్ లను మరియు సూపర్ కెపాసిటర్లను దేశీయంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని ఇస్రో పేర్కొంది.

ఫోటోలు: ISRO

 
English summary
Read In Telugu To Know About ISRO Developed A Solar Electric Car.
Story first published: Thursday, May 4, 2017, 14:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark