రూబీ రెడ్ కలర్ ఆప్షన్‌లో ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్ విడుదల

Written By:

ఇసుజు ఇండియా తమ డి-మ్యాక్స్ వి-క్రాస్ అడ్వెంచర్ యుటిలిటి వెహికల్(AUV)ను సరికొత్త రూబీ రెడ్ కలర్ ఆప్షన్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్చిడ్ బ్రౌన్, కాస్మిక్ బ్లాక్, టైటానియమ్ సిల్వర్, ఆబ్సిడియన్ గ్రే మరియు స్ల్పాష్ వైట్ కలర్ ఆప్షన్స్‌కు జోడింపుగా రూబీ రెడ్ కలర్‌ను చేర్చింది.

కొత్త కలర్ ఆప్షన్‌లో విడుదలైనప్పటికీ అదే పాత ధరతోనే ఇసుజు వి-క్రాస్ అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. 13.16 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్

ఇసుజు వి-క్రాస్ కేవలం డబుల్ క్యాబ్ పికప్ ట్రక్ మాత్రమే కాదు, ప్రీమియమ్ ఫీచర్లతో కూడిన భారతదేశంలోనే అరుదైన పికప్ ట్రక్కుగా నిలిచింది.

కార్లలో ఉండే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్, 6-రకాలుగా డ్రైవర్ సీటును అడ్జెస్ట్ చేసుకునే ఫీచర్, 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎన్నో ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్

ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ప్రీమియమ్ పికప్ ట్రక్కులో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు. ఈ ఫీచర్ ఉండటం ద్వారా ట్రక్కు మూవింగ్‌లో ఉన్నపుడు ముందు చక్రాలకు, లేదా వెనుక రెండు చక్రాలకు, లేదంటే అన్ని చక్రాలకు ఇంజన్ పవర్ మరియు టార్క్‌ను సరఫరా చేసే విధంగా డ్రైవ్ సిస్టమ్‌లో మార్పులు చేసుకోవచ్చు.

ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్

అంతే కాకుండా, ఎత్తు రోడ్ల మీద, లోతైన ప్రదేశాల నుండి బయటకు, స్నో మరియు అసమాన తలాల మీద వాహనం కదలడానికి కావాల్సిన పవర్ మరియు టార్క్ చక్రాలకు అందించేందుకు ఫోర్ లోడ్ మోడ్స్ ఉన్నాయి.

ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్

భద్రత పరంగా, మంచి పేరున్న ఎస్‌యూవీలు సైతం దీని ముందు వెనక్కి తగ్గాల్సిందే. ఇందులో ప్రధానంగా ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ మరియు చిన్న పిల్లల సీట్లను క్యాబిన్‌లో ఫిక్స్ చేయడానికి ఐఎస్ఒఫిక్స్ యాంకర్స్ ఉన్నాయి.

Recommended Video
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్

ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ వెహికల్‌లో 2.5-లీటర్ సామర్థ్యం గల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గల ఇది గరిష్టంగా 134బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రూబీ రెడ్ కలర్ ఆప్షన్‌లో భారతదేశపు తొలి అడ్వెంచర్ యుటిలిటి వెహికల్‌ డి-మ్యాక్స్ వి-క్రాస్‌ను ఎంచుకోవడం బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే, అదే పాత ధరతోనే డి-మ్యాక్స్‌ను అందుబాటులో ఉంచింది ఇసుజు.

Read more on: #ఇసుజు #isuzu
English summary
Read In Telugu: Isuzu India Introduces New Ruby Red Colour In D-Max V-Cross
Story first published: Tuesday, September 26, 2017, 21:17 [IST]
Please Wait while comments are loading...

Latest Photos