ఆంధ్రప్రదేశ్‌లో నాలుగవ విక్రయ కేంద్రాన్ని తెరచిన ఇసుజు ఇండియా

Written By:

ఇసుజు మోటార్స్ ఇండియా విక్రయ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న మూడు విక్రయ కేంద్రాల సంఖ్య నూతన షోరూమ్ ప్రారంభంతో నాలుగు చేరింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి విజయవాడలో ఇసుజు యొక్క నాలుగవ షోరూమ్ మహవీర్ ఇసుజు ను తెరిచింది.

విజయవాడలో ఇసుజు నాలుగవ షోరూమ్

ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి మరియు తిరుపతి నగరాలలో ఒకటి చెప్పున మొత్తం మూడు ఇసుజు విక్రయ కేంద్రాలు ఉండేవి, అయితే ఇప్పుడు విజయవాడ మహవీర్ షోరూమ్ ప్రారంభంతో ఈ సంఖ్య నాలుగు చేరింది.

విజయవాడలో ఇసుజు నాలుగవ షోరూమ్

విజయవాడ మహవీర్ ఇసుజు విక్రయ కేంద్ర ప్రారంభ సందర్భంగా ఇసుజు యొక్క నూతన డి-మ్యాక్స్ వి-క్రాస్ అడ్వెంచర్ యుటిలిటి వాహనాన్ని విడుదల చేసింది.

విజయవాడలో ఇసుజు నాలుగవ షోరూమ్

ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనం ప్రస్తుతం భారత దేశపు మొట్టమొదటి అడ్వెంచర్ యుటిలిటి వెహికల్‌గా నిలిచింది. ఇందులో 2499సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు.

విజయవాడలో ఇసుజు నాలుగవ షోరూమ్

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ గరిష్టంగా 134బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది.

విజయవాడలో ఇసుజు నాలుగవ షోరూమ్

మహవీర్ గ్రూప్ ఛైర్మన్ యశ్వంత్ జబఖ్ మాట్లాడుతూ, ఇసుజు పరిచయం చేసిన డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనానికి సానుకూలమైన స్పందన లభిస్తోంది. తమ పరిధిలో ఉన్న ఇసుజు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కార్యకలాపాలు చేపడతామని తెలిపాడు.

విజయవాడలో ఇసుజు నాలుగవ షోరూమ్

ఇసుజు పరిధిలోని వాహనాల విషయానికి వస్తే, వి-క్రాస్ శ్రేణితో పాటు అన్ని వాహనాలను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటి ప్లాంటులో ఉత్పత్తి చేపడుతోంది. ఈ ప్రొడక్షన్ ప్లాంటు ద్వారా ఏడాదికి 50,000 వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.

విజయవాడలో ఇసుజు నాలుగవ షోరూమ్

అడ్వెంచర్ మరియు ఎస్‌యూవీ వాహనాలను కోరుకునే వారికి డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనం ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. డి-మ్యాక్స్ వి-క్రాస్ ప్రారంభ ధర రూ. 13,25,442 లు ఎక్స్ షోరూమ్ (విజయవాడ)గా ఉంది.

విజయవాడలో ఇసుజు నాలుగవ షోరూమ్

ఇండియన్ మార్కెట్లో అడ్వెంచరస్, ఎస్‌యూవీ మరియు విలాసవంతమైన ఫీచర్లను కలిగిన వాహనాలలో ఏకైక మరియు అత్యుత్తమ వాహనం ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనం... దీనికి సంభందించిన ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోలు...

 
Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu Motors Opens Fourth Dealership In Andhra Pradesh
Story first published: Friday, February 10, 2017, 13:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos