రెండు స్పోర్ట్స్ కార్లను విడుదల చేసిన జాగ్వార్

Written By:

టాటా దిగ్గజం సొంతం చేసుకున్న బ్రిటన్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ విపణిలోకి ఎఫ్-టైప్ ఎస్‌విఆర్(F-Type SVR) స్పోర్ట్స్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే ధర రూ. 2.45 కోట్లు మరియు ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కన్వర్టిబుల్(రూఫ్ టాప్ ఓపెన్ మరియు క్లోజ్ అయ్యే) ధర రూ. 2.63 కోట్లు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే మరియు కన్వర్టిబుల్ విడుదల

సాంకేతికంగా జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే మరియు కన్వర్టిబుల్ కార్లలో 5.0-లీటర్ల సామర్థ్యం ఉన్న సూపర్ ఛార్జ్‌డ్ వి8 ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు అందుతుంది.

Recommended Video - Watch Now!
2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే మరియు కన్వర్టిబుల్ విడుదల

జాగ్వార్ స్పెషల్ వెహికల్స్ ఆపరేషన్స్ డివిజన్ రూపొందించిన ఈ ఇంజన్ 6,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 567బిహెచ్‌పి పవర్ మరియు 3,500ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 700ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే మరియు కన్వర్టిబుల్ విడుదల

జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే కారు కేవలం 3.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 322కిలోమీటర్లుగా ఉంది. అదే విధంగా జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కన్వర్టిబుల్ కూడా 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అదే సమయంలో అందుకుంటుంది, అయితే గరిష్ట వేగం గంటకు 314కిలోమీటర్లుగా ఉంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే మరియు కన్వర్టిబుల్ విడుదల

ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ స్పోర్ట్స్ కారులో టైటానియమ్ మరియు ఇకోనియల్‌తో తయారు చేసిన తేలిక పాటి బరువున్న ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. సూపర్ కారు ఇచ్చే శబ్దాన్ని డ్రైవర్ వినాలనుకున్నప్పుడు మ్యాన్యువల్‌గా ఎగ్జాస్ట్ సిస్టమ్ అడ్జెస్టు చేసుకునే అదనపు ఫీచర్ ఇందులో ఉంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే మరియు కన్వర్టిబుల్ విడుదల

జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్‌ను గాలి ద్వారా కలగే ఘర్షణను నివారించేందుకు ఏరోడైనమిక్ లక్షణాలతో డిజైన్ చేశారు. కార్బన్ ఫైబర్ రియర్ వింగ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ లో హీటెడ్ లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, అల్యూమినియం గేర్ షిఫ్ట్ పెడల్స్ ఉన్నాయి.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ కూపే మరియు కన్వర్టిబుల్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్ కార్ సెగ్మెంట్లో ఎస్‌విఆర్ ఒక క్రేజీ వేరియంట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే విపణిలో ఉన్న విదేశీ స్పోర్ట్స్ కార్లకు టాటా భాగస్వామ్యపు సంస్థ జాగ్వార్ అభివృద్ది చేసిన ఎస్‌విఆర్ స్పోర్ట్స్ కార్లు గట్టి పోటీనివ్వనున్నాయి.

English summary
Read In Telugu: Jaguar F-Type SVR Launched In India; Prices Start At Rs 2.45 Crore

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark