జీప్ కంపాస్ కొనేందుకు వెళితే షోరూమ్ సిబ్బంది ఎంత పని చేసిందో తెలుసా...?

Written By:

జీప్ ఇండియా డీలర్‌కు చెందిన ఉద్యోగులు కస్టమర్ మీద హింసాత్మకంగా దాడి చేశారు. ఢిల్లీలోని ల్యాండ్‌మార్క్ జీప్ ఇండియా షోరూమ్‌లో జరిగిన ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

కస్టమర్ మీద దాడికి పాల్పడిన షోరూమ్ సిబ్బంది

అక్కడ జరిగిన సంఘటను చూడటానికి భయంకరంగానే ఉంది, దాడికి గురైన వ్యక్తి జీప్ కంపాస్ కొనుగోలు చేయడానికి సిద్దపడిన కస్టమర్ అని తెలుస్తోంది. జరిగిన సంఘటనను బట్టి చూస్తే అతను ఖచ్చితంగా జీప్ వాహనాన్ని ఎంచుకోడని చెప్పవచ్చు.

కస్టమర్ మీద దాడికి పాల్పడిన షోరూమ్ సిబ్బంది

జీప్ షోరూమ్‌లో తీసిన వీడియో గందరగోళకరమైన వాతావారణం కనిపించింది. భాదిత కస్టమర్‌ను ప్రత్యేక క్యాబిన్‌లోకి చేర్చడానికి ముందు చాలా మంది కస్టమర్ ఎక్జ్సిక్యూటివ్స్ మరియు ఉద్యోగులు విక్రయ కేంద్రంలో గుంపులు గుంపులుగా గుమికూడారు.

కస్టమర్ మీద దాడికి పాల్పడిన షోరూమ్ సిబ్బంది

సఫారీ సూటులో ఉన్న వ్యక్తి మీద జీప్ ఉద్యోగులు కొంత మంది దురుసుగా ప్రవర్తిస్తూ, ఆయన మీద దాడికి దిగారు. నిజానికి ఇది సాదాసీదా సంస్థ కాదు. జీప్ అంటే ఒక బ్రాండ్. దీనిని ప్రక్కనబెట్టిన జీప్ ఉద్యోగులు కస్టమర్ మీద దాడికి దిగడం చాలా చిన్నతనంగా ఉందని చెప్పవచ్చు.

కస్టమర్ మీద దాడికి పాల్పడిన షోరూమ్ సిబ్బంది

అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ ఇటీవలె ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. తాజాగ ప్రవేశపెట్టిన మోడల్ కంపాస్ ఎస్‌యూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న జీప్ విక్రయ కేంద్రాలకు కస్టమర్ల తాకిడి బాగానే ఉంది.

https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FRoyalEnfieldBulletCLUB%2Fvideos%2F1481664798548895%2F

వీడియో చూసిన తరువాత, జీప్ ఇండియా తమ ప్రతినిధులుకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని, సహనంతో కస్టమర్ల పట్ల అంకిత భావంతో స్నేహ పూర్వకంగా మెలగాల్సి ఉంటుంది. లక్షలు వెచ్చించి కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల పట్ల షోరూమ్ నిర్వాహకులు ఇలా దురుసుగా ప్రవర్తించడం అమానుషకరంగా ఉంది.

కస్టమర్ మీద దాడికి పాల్పడిన షోరూమ్ సిబ్బంది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఢిల్లీలోని జీప్ ల్యాండ్‌మార్క్ విక్రయ కేంద్రంలో సరిగ్గా ఏం జరిగిందో తెలియరాలేదు. అయితే, అక్కడ జరిగిన సంఘటన గురించిన వీడియో లీక్ కావడంతో జీప్ ఇండియా ఖచ్చింతగా దీని మీద వివరణ ఇస్తూ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగును చూస్తూ ఉండి.

మీ నగరంలో మీకు నచ్చిన కార్ల ధరలు ఇక్కడ తెలుసుకోండి మరియు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రోజూ వారీ పెట్రోల్ మరియు డీజల్ ధరలు తెలుసుకోండి....

English summary
Read In Telugu: Jeep Dealership Executives In Delhi Beat Up Man Inside Showroom

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark