లిమిటెడ్ ఎడిషన్ నింజా హెచ్2 కార్బన్ హైపర్ బైక్ విడుదల చేసిన కవాసకి

Written By:

జపాన్‌కు చెందిన ప్రీమియమ్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కవాసకి 2017 నింజా హెచ్2 హైపర్ బైక్ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త హెచ్2 కార్బన్ బైకులో ఫీచర్ల పరంగా కొత్త వాటిని చేర్చడం జరిగింది. అందుకే వీటిని లిమిటెడ్‌గానే అందుబాటులోకి తెచ్చినట్లు కవాసకి తెలిపింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్

ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న సాధారణ హెచ్2 మోడల్‍‌కు భిన్నంగా ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బైకులో ముందువైపున కార్బన్ ఫైబర్ గిన్నెను అందించారు. మిర్రర్ల మీద ఉన్న ప్రత్యేక పెయింట్ జాబ్ మరియు నెంబర్ ప్లేట్‌ తొలగించారు.

 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్

కవాసకి మోటార్స్ కార్పోరేషన్ అమెరికా విభాగాధ్యక్షుడు బిల్ జెన్కిన్స్ మాట్లాడుతూ, ఈ లిమిటెడ్ ఎడిషన్ నింజా హెచ్2 కార్బన్ మోడల్ రైడింగ్ ప్రియులకు బెస్ట్ బైకుగా నిలవనుంది. తొలిసారిగా దీనిని మార్కెట్లోకి విడుదల చేసినపుడు మార్కెట్లో మంచి స్పందన లభించింది.

 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్

అయితే ఫిబ్రవరి 13 న బుకింగ్స్ ప్రారంభించిన అనంతరం హెచ్2 కార్బన్ మోటార్ సైకిల్‍‌‌ను ఎంచుకోవడానికి స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల ఎంపికదారులు భారీగా పోటీపడే అవకాశం ఉందని బిల్ జెన్కిన్స్ అభిప్రాయం వ్యక్తం చేసారు.

ప్రస్తుతం 2017 హెచ్2 మోడల్‌లో అందించిన అప్‌‌డేట్స్

ప్రస్తుతం 2017 హెచ్2 మోడల్‌లో అందించిన అప్‌‌డేట్స్

 • ఎక్కువ ధృడత్వం, తక్కువ బరువున్న (కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్‌మెంట్ పాలిమర్) అప్పర్ కౌల్ అందించారు.
 • మట్టీ ఎలిమెంట్ పెయింట్ ఫీచర్ గల సిల్వర్ మిర్రర్లు
 • అన్ని 120 మోడళ్లకు కూడా వ్యక్తిగత నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్ ప్రకారం ఆ నెంబర్లను సూపర్ ఛార్జర్ ప్లేటులోకి జొప్పించడం జరిగింది
 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్
 • ఇందులో బాష్ కాంపాక్ట్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ అందించారు. ఇది అదనపు సమాచారాన్ని మరియి మేనేజ్‌మెంట్ కంట్రోల్స్‌కు చెందిన వ్యవస్థలను నియంత్రిస్తుంది.
 • మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్
 • కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్
 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్
 • ఇందులోని ఇంస్ట్రుమెంట్ ఫీచర్ ద్వారా బ్యాంక్ యాంగిల్ డిస్ల్పే మరియు గరిష్ట బ్యాంక్ యాంగిల్ రికార్డింగ్ ఫంక్షన్
 • కవాసకి ఇంటెలిజెంట్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్
 • పెరుగుతున్న కార్నరింగ్ సామర్థ్యానికి సంభందించిన సమాచారాన్ని ఐఎమ్‌యు ని నుండి పొందడం
 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్
 • ఒహ్లిన్స్ టిటిఎక్స్ ఫుల్లీ అడ్జెస్టబుల్, కాన్సెంట్రిక్ ట్విన్ ట్యూబ్ డిజైన్ గల రియర్ షాక్
 • రైడర్ పర్ఫామెన్స్ కోసం టూల్స్‌ను వినియోగించకుండా, రిమోట్ ప్రిలోడెడ్ అడ్జెస్టర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం కలదు
 • స్థిరత్వానికి సంభందించిన అనుభూతి కోసం వెనుక వైపు అప్‌డేటెడ్ రియర్ షాక్ లింకేజ్‌లను అందివ్వడం జరిగింది
 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్
 • ముందువైపున నాలుగు పిస్టన్ల బ్రెంబో మోనోబ్లాక్ కాలిపర్లు గల 330ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కలదు
 • గాలి ద్వారా కలిగే ఘర్షణను అధిగమించేందుకు బ్రెంబో బ్రేకులను మరియు క్లచ్ లివర్లను పొట్టిగా మరియు ఎడ్జ్‌లను గుండ్రంగా తీర్చిదిద్దారు
 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్

ఇక ఈ మోటార్ సైకిల్‌ను కొనుగోలు చేసే వారు ముందస్తు బుకింగ్ కోసం 10,000 డాలర్ల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి కవాసిక డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. వీటి బుకింగ్స్ ను ఫిబ్రవరి 13 న ప్రారభించనున్నారు మరియు మొదటి 120 మంది కస్టమర్లకు మాత్రమే వీటిని అందిస్తోంది.

 కవాసకి నింజా హెచ్ 2 కార్బన్ హైపర్ బైక్

కవాసకి నింజా హెచ్2 లిమిటెడ్ ఎడిషన్ కార్బన్ మోటార్ సైకిల్ అమ్మకాల అనంతరం రోడ్2రికవీ అనే ఫౌండేషన్‌కు సుమారుగా 20,000 అమెరికన్ డాలర్లు విరాళంగా అందజేయనుంది.

 

English summary
Kawasaki Launches Limited Edition Ninja H2 Carbon Hyperbike
Story first published: Saturday, February 4, 2017, 15:54 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark