క్రికెట్ మాత్రమే కాదు బ్యాట్మింటన్ కూడా గొప్పదే: శ్రీకాంత్‌కు మహీంద్రా టియువి300 కానుకిచ్చిన ఆనంద్

Written By:

మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా గారు ట్విట్టర్ మాధ్యమంలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తన గురించి జరుగుతున్న అన్ని ట్వీట్లతో పాటు, సామాజిక ధృక్పథంతో తనదైన శైలిలో వీలైనంత వరకు రీప్లేలు ఇస్తుంటారు. కానుకలివ్వడంలో ఉదారస్వభావం ఉన్న వ్యక్తి ఆనంద్ మహీంద్రా.

శ్రీకాంత్‌కు మహీంద్రా టియువి300 కానుకిచ్చిన ఆనంద్

ఇండియాలో అనేక మంది దిగ్గజ వాహన తయారీ సంస్థలకు మేనేజింగ్ డైరక్టర్లకు వ్యవహరిస్తున్నారు. వారితో పోల్చుకుంటే ఆనంద్ మహీంద్రా గారు చాలా ప్రత్యేకం. తన పేరు మరియు తన సంస్థ గురించి ట్వీట్ చేసిన వారికి అనేక కానుకలిచ్చాడు.

శ్రీకాంత్‌కు మహీంద్రా టియువి300 కానుకిచ్చిన ఆనంద్

గత ఏడాది పారా ఒలంపిక్స్‌లో అద్భుత పనితీరు కనబరచిన సాక్షి మాలిక్‌కు మహీంద్రా థార్ ప్రధానం చేయడం, కేరళలో ఓ ఆటో డ్రైవర్ ఆటో వెనుక భాగాన్ని స్కార్పియో తరహాలో మోడిఫై చేసుకున్నాడు. అది నచ్చిన ఆనంద్ మహీంద్రా సుప్రో వ్యాన్ ప్రధానం చేయడం జరిగింది.

శ్రీకాంత్‌కు మహీంద్రా టియువి300 కానుకిచ్చిన ఆనంద్

ఇలా ఎన్నో సార్లు ఆనంద్ మహీంద్రా మరియు మహీంద్రా కంపెనీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్న వారికి, మహీంద్రా లైనప్‌లో ఉన్న వాహనాలను బహుమానంగా ఇచ్చి అందరికీ షాకిస్తుంటాడు.

శ్రీకాంత్‌కు మహీంద్రా టియువి300 కానుకిచ్చిన ఆనంద్

ఈ జాబితాలో తాజాగా భారత బ్యాట్మింటన్ ఛాంపియన్ కిదాంబి శ్రీకాంత్ చేరాడు. రెండు సూపర్ సిరీస్‌లలో విజేతగా నిలిచిన శ్రీకాంత్‌ను అభినందిస్తూ ట్వీట్ల మోత మోగింది. సూపర్ సిరీస్ టైటిళ్లను కైవసం చేసుకున్న శ్రీకాంత్‌కు భారత బ్యాట్మింటన్ అసోసియేషన్ రూ. 5 లక్షల రుపాయలు నగదు ప్రధానం చేసింది.

శ్రీకాంత్‌కు మహీంద్రా టియువి300 కానుకిచ్చిన ఆనంద్

బ్యాట్మింటన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశం మొత్తాన్ని గర్వించేలా చేసిన శ్రీకాంత్ కేవలం ఐదు లక్షలు మాత్రమే ఇవ్వడం ఏంటని ఎంతో మంది అనుకుంటారు. కానీ దీని గురించి అడిగేవాళ్లు దాదాపు తక్కువే.

శ్రీకాంత్‌కు మహీంద్రా టియువి300 కానుకిచ్చిన ఆనంద్

అయితే NastreTheMust అనే పేరుతో ఓ వ్యక్తి ఆనంద్ మహీంద్రా గారిని ట్యాగ్ చేస్తూ, క్రికెట్‌తో పోల్చుకుంటే కిదాంబి శ్రీకాంత్‌కు రూ. 5 లక్షలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని అడిగాడు.

శ్రీకాంత్‌కు మహీంద్రా టియువి300 కానుకిచ్చిన ఆనంద్

అయితే, ట్విట్టర్‌లో నిరంతరం యాక్టివ్‌లో ఉండే ఆనంద్ వెంటనే ఆ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ, స్టీమ్‌రోలర్ (ఆనంద్ మహీంద్రా శ్రీకాంత్‌కు పెట్టిన పేరు) తన అద్బుతమైన ఆటతీరుతో మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు, అందరినీ గర్వపడేలా చేసిన బ్యాట్మింటన్ ఛాంపియన్ కిదాంబి శ్రీకాంత్‌కు టియువి300 వాహనాన్ని ప్రధానం చేస్తానని పేర్కొన్నాడు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

తన వయస్సు మరియు హోదాను ప్రక్కకునెట్టి అభిమానులు, కస్టమర్లతో ట్విట్టర్ ద్వారా స్పందించే విధానం చాలా అద్బుతం. ఉన్నతమైవ పొజిషన్‌లో ఉన్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలను మనం ఆనంద్ మహీంద్రా గారిలో స్పష్టంగా గుర్తించవచ్చు. ఆనంద్ గారి నుండి మహీంద్రా టియువి300 వాహనం అందుకోవడం కిదాంబి శ్రీకాంత్‌కు ఓ విధమైన ప్రోహాత్సం అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu Anand Mahindra Gifts Mahindra TUV300 To Badminton Champion Kidambi Srikanth
Story first published: Wednesday, June 28, 2017, 12:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark