లెక్సస్ ఇండియా విడుదలకు ముహూర్తం ఖరారు

Written By:

లెక్సస్, ప్రపంచ విపణిలో లగ్జరీ కార్ల తయారీ సంస్థగా మంచి పేరును గడిచింది. ఇండియన్ మార్కెట్లో ఏడాది జపాన్ కు చెందిన టయోటా మోటార్స్ యొక్క లగ్జరీ కార్ల బ్రాండ్‌గా లెక్సస్ అడుగుపెట్టనుంది. మార్చి 24, 2017 న దేశీయ విపణిలోకి తమ కార్ల విడుదల ద్వారా అధికారిక కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి.

మూడు మోడళ్ల ద్వారా విపణిలోకి ఎంట్రీ ఇవ్వనున్న లెక్సస్, రెండు ఎస్‌యూవీలను మరియు ఒక సెడాన్ ను విడుదలకు సిద్దం చేస్తోంది. అందులో ఆర్ఎక్స్450హెచ్ హైబ్రిడ్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న ఎల్ఎక్స్ బ్రాండెడ్ యొక్క టాప్ ఎండ్ ఎస్‌యూవీని అదే విధంగా ఇఎస్300హెచ్ హైబ్రిడ్ సెడాన్ ఉన్నట్లు తెలిసింది.

ఆర్ఎక్స్450హెచ్ ఎస్‌యూవీ ధర సుమారుగా రూ. 1.17 కోట్లుగా ఉండనుంది. సాంకేతికంగా ఇందులో 3.5-లీటర్ సామర్థ్యం గల వి6 పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో కలదు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది సుమారుగా 304బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

ఎల్ఎక్స్ సిరీస్ అనగా లెక్సస్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడళ్ల, ఇందులో ప్రముఖంగా ఎల్ఎక్స్450డి మరియు ఎల్ఎక్స్570 ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలోని ఇంజన్‌లు ఉత్పత్తి చేసే పవర్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ యొక్క పవర్‌కు సమానం.

ఎల్ఎక్స్450డి లోని 4.5-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టర్బో వి8 డీజల్ ఇంజన్ గరిష్టంగా 265బిహెచ్‌పి పవర్ మరియు 650ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఎల్ఎక్స్570 లో 5.7-లీటర్ సామర్థ్యం గల వి8 డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 378బిహెచ్‌పి పవర్ మరియు 546ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

లెక్సస్ 450డి వేరియంట్ ధర సుమారుగా రూ. 2 కోట్లు మరియు ఎల్ఎక్స్570 ధర సుమారుగా రూ. 2.15 కోట్లు ఎక్స్ షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

లెక్సస్ అధికారంగా విడుదలకు సిద్దం చేస్తున్న మొట్టమొదటి సెడాన్ ఇఎస్300హెచ్. ప్రస్తుతం టయోటా క్యామ్రీలో ఉన్న అదే శక్తివంతమైన ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో వస్తోంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా రూ. 75 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

 

English summary
Lexus India Launch Date Revealed — Three Models On The Cards
Story first published: Friday, February 10, 2017, 11:08 [IST]
Please Wait while comments are loading...

Latest Photos