లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ రివీల్

Written By:

జపాన్ లగ్జరీ కార్ల దిగ్గజం లెక్సస్ అతి త్వరలో విడుదల చేయనున్న ఎన్ఎక్స్ 300హెచ్ కారును ఇండియాలో ఆవిష్కరించింది. సరికొత్త ఎన్ఎక్స్ 300హెచ్ హైబ్రిడ్ వేరియంట్ లెక్సస్ ఇండియా లైనప్‌లో అతి చిన్న ఎస్‌యూవీగా నిలవనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

లెక్సస్ ఇదివరకే ఎన్ఎక్స్ 300హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీని 2017 షాంఘై మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా దీని ప్రారంభ ధర రూ. 60 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

Recommended Video
[Telugu] 2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India - DriveSpark
లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

టెక్నికల్‌గా లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ ఎస్‌యూవీలో నాలుగు సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌కు అనుసంధానమై ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఇంజన్ సంయుక్తంగా 194బిహెచ్‌పి పవర్ మరియు 210ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

హైబ్రిడ్ వ్యవస్థకు అనుసంధానం చేసిన సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.2 సెకండ్ల వ్యవధిలో చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 180కిలోమీటర్లుగా ఉంది.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఫ్రంట్ డిజైన్‌లో అత్యంత ఆకర్షణీయమైన లెక్సస్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కు ఇరువైపులా చిన్న పరిమాణంలో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, వాటికి క్రిందగా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు బంపర్‌లో L ఆకారంలో ఉన్న హౌసింగ్‌లో ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 17- మరియు 18-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్‌కు ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్ ఉన్నాయి. ఫ్రంట్ డోర్ నుండి రియర్ టెయిల్ లైట్ల వరకు పొడగించబడిన క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దేశీయ మార్కెట్లోకి రానున్న వెర్షన్‌లో 10.3-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెథర్ సీట్లు, ఆంబియంట్ లైట్, పానరోమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు రానున్నాయి.

లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లెక్సస్ ఇండియా సరికొత్త ఎన్ఎక్స్ 300హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ భారీ ధరతో తీసుకొస్తోంది. జర్మన్ దిగ్గజాలు విక్రయిస్తున్న మోడళ్ల కంటే దీని ధర అధికంగా ఉంది. లగ్జరీ అని విర్రవీగే వారు లెక్సస్ కార్ల మీద ఓ లుక్కేసుకుంటే దిమ్మతిరగడం ఖాయం. లెక్సస్‌లో ప్రారంభ ఎస్‌యూవీ ధర 60 లక్షలయితే, ఇంకా హై ఎండ్ మోడళ్ల ధరలు ఎలా ఉంటాయో అంచనా వేసుకోవచ్చు.

లెక్సస్ ఫ్యాన్స్‌కు ఇది సరైకన ఎంపిక అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Lexus NX 300h Hybrid SUV Revealed In India
Story first published: Friday, November 17, 2017, 18:02 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark