సోలార్ పవర్‌తో మాత్రమే నడిచే కార్లను రూపొందించి, కంపెనీనే స్థాపించిన విద్యార్థులు

Written By:

ఎలక్ట్రిక్ కార్ల భవిష్యత్తు రూపం సోలార్ పవర్‌తో నడిచే కార్లు అని చెప్పవచ్చు. నిజమే ఇంధనం లేకుండా నడిచే కార్లకు ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ కార్లు. మరి ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే కార్లకు ప్రత్యామ్నాయం ఏమిటి? దీనికి ప్రత్యామ్నాయం సోలార్ కార్లు అంటూ ముందుకు వచ్చింది నెదర్లాండ్స్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం.

సోలార్ పవర్‌తో నడిచే కారు

డీజల్ మరియు పెట్రోల్ కార్లకు బదులుగా హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు వచ్చేసాయి. కాలుష్యం తగ్గిపోవడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. ఈ మార్పు ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి ఎంతో అవసరం. ఇంకాస్త ముందుకెళ్లి ఆలోచిస్తే, ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ కొరత వంటి సమస్యలు ఎదురవడం ఖాయం.

సోలార్ పవర్‌తో నడిచే కారు

మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని చూస్తే, సోలార్ పవర్‌తో నడిచే కార్లే ఇందుకు చక్కటి పరిష్కారం అని తేలింది. అయితే సోలార్ ప్యానెళ్ల ద్వారా కారుకు ఛార్జింగ్ చేయడం చాలా క్లిష్టంగా మారింది. సోలార్ ప్యానెళ్లు అధిక బరువును కలిగి ఉండటమే ఇందుకు ప్రధాన సమస్య.

సోలార్ పవర్‌తో నడిచే కారు

అయితే నెదర్లాండ్‌ దేశంలోని ఈంధోవన్ టెక్నికల్ యూనివర్శిటీలోని ఓ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. సూపర్ కార్ల డిజైన్‌ను తలదన్నే రీతిలో సోలార్ పవర్‍‌తో నడిచే కారును రూపొందించారు. అంతే కాకుండా ఈ కార్ల ప్రొడక్షన్ ప్రారంభించి, విక్రయాలు చేపట్టేందుకు ఓ కంపెనీనే ప్రారంభించారు. వీరి గురించి చదువుతుంటే ఎంతో ఆసక్తిగా ఉంది కదూ... అయితే వీరి ప్రయోగం గురించి మరిన్ని వివరాలు చూద్దాం రండి....

సోలార్ పవర్‌తో నడిచే కారు

సోలార్ టీమ్ ఈంధోవన్ బృందం ప్రోటోటైప్ సోలార్ కారును స్టెల్లా లక్స్ అనే పేరుతో ఆవిష్కరించారు. కారు బరువును వీలైనంత వరకు తగ్గించేందుకు ఏరోడైనమిక్ డిజైన్ లక్షణాలతో కార్బన్ ఫైబర్ మరియు అల్యూమినియంతో రూపొందించారు.

సోలార్ పవర్‌తో నడిచే కారు

కాంపిటీషన్‌లో భాగంగానే స్టెల్లా లక్స్ కారును నిర్మించారు. రహదారుల మీద రోజూ వారి అవసరాలకు వినియోగించుకునేలా, తగినన్ని భద్రత ఫీచర్లను కల్పించడం తప్పనిసరి వంటి సవాళ్లతో ఈ సోలార్ పవర్ కారును నిర్మించాల్సి ఉంటుంది. కాంపిటీషన్‌లోని అన్ని సవాళ్లను ఎదుర్కొని స్టెల్లా లక్స్ కారును ఆవిష్కరించారు.

సోలార్ పవర్‌తో నడిచే కారు

విద్యార్థుల బృందం రూపొందించిన కారు ప్రాక్టికల్‌గా సక్సెస్ సాధించడంతో లైట్ ఇయర్ అనే కంపెనీ నెలకొల్పారు. సోలార్ పవర్ ద్వారా తనంతట తానుగా ఛార్జింగ్ చేసుకునే ఫీచర్‌తో పాటు అన్ని అదనపు ఫీచర్లను కల్పిస్తూనే కారు బరువు పెరగకుండా జాగ్రత్త వహించారు.

సోలార్ పవర్‌తో నడిచే కారు

లైట్‌ఇయర్ కంపెనీ ప్రకటన ప్రకారం, సంవత్సరం పొడవునా ఈ సోలార్ పవర్ కారు అన్ని వాతావరణ పరిస్థితుల్లో 10,000 కిలోమీటర్ల నుండి 20,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. 2019 నాటికి తొలుత పది కార్లను ఉత్పత్తి చేసి, 2020 నాటికి 100 కార్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కానీ ఓ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యామ్నాయంగా పూర్తిగా సోలార్ పవర్‌తో నడిచే కారును రూపొందించి, ప్రాక్టికల్‌గా నిరూపించి, ఓ కంపెనీనే నెలకొల్పడం జరిగింది. లైట్‌ఇయర్ కంపెనీ ఆవిష్కరించిన స్టెల్లా లక్స్ సోలార్ కారు పూర్తి స్థాయిలో విపణిలోకి వస్తే, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో సంచలనం సృష్టించడం ఖాయం.

English summary
Lightyear — The Street-Legal Solar Car Teased

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark