మేడిన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల: ధర రూ. 47.50 లక్షలు

టాటాకు చెందిన బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ మేడిన్ ఇండియా జాగ్వార్ ఎక్స్ఎఫ్ ను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 47.50 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

By Anil

జాగ్వార్ ఇండియా విభాగం టాటా మోటార్స్ తమ సహకారంతో దేశీయంగా అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభించింది. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన రెండవ తరానికి జాగ్వార్ ఎక్స్ఎప్ కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జాగ్వార్ డీలర్లు దీనికి చెందిన బుకింగ్స్‌ను ప్రారంభించారు.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

జాగ్వార్ ఇప్పుడు ఎక్స్ఎఫ్ వేరియంట్ ధరను సవరించింది. దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించిడం ఇందుకు కలిసొచ్చిందని చెపవచ్చు. దీంతో కొనుగోళ్లలో వృద్ది నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విపణిలోకి విడుదలైన అనంతరం జాగ్వార్ విక్రయ కేంద్ర యాజమానులు ఈ వేరియంట్ మీద అధికారిక బుకింగ్స్ ప్రారంభించారు.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

దేశీయంగా అసెంబుల్ అవుతున్న వేరియంట్లో చోటు చేసుకున్న మార్పుల మీద దృష్టి సారిస్తే, ఎక్స్ఎఫ్ పెట్రోల్ లోని టాప్ ఎండ్ వేరియంట్లో 18-అంగుళాల హీలిక్స్ 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ కలవు మరియు ప్రెస్టేజ్ వేరియంట్ 18-అంగుళాల పరిమాణం ఉన్న ట్విన్ స్పోక్ డిజైన్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

ఈ ఎక్స్ఎఫ్ సెడాన్ యథావిధిగా ప్యూర్, ప్రెస్టేజ్ మరియు పోర్ట్‌ఫోలియో అనే వేరియంట్లను కొనసాగిస్తోంది. సాంకేతికంగా ఎక్స్ఎఫ్ సెడాన్ 177బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ ఇంజీనియమ్ డీజల్ మరియు 237బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

సరికొత్త జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్ కొన్ని ఆధునిక సాంకేతిక ఫీచర్లను కలిగి ఉంది. అవి, 25.9 సెంటీ మీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ గల ఇన్‌కంట్రోల్ టచ్ ప్రొ సిస్టమ్ మరియు మెరేడియన్ సౌండ్ సిస్టమ్ కలదు.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్ రోహిత్ సూరి మాట్లాడుతూ, 2009 లో తొలిసారిగా జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్‌ను పరిచయం చేసినప్పటి నుండి మంచి విజయాన్ని అందుకున్నాము. ఆశించిన ఫలితాలను సాధించడంలో సఫలం చెందాము. అయితే ఇప్పుడు దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుతామని విశ్వాసాన్ని వ్యక్తం చేసాడు."

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

ఓ ప్రకటన ద్వారా జాగ్వార్ తెలిపిన వివరాల మేరకు, సరికొత్త జాగ్వార్ ఎక్స్ఎఫ్ దృష్టిని ఆకర్షించే అధునాతన ఫ్రంట్ డిజైన్, శక్తివంతమైన ఇంజన్ వేరియంట్లు, సాంకేతికంగా నూతన ఫీచర్ల జోడింపుతో పాటు ఎఫ్-టైప్ ప్రేరిత నాణ్యమైన డిజైన్ లక్షణాలను ఇముడింపచేసినట్లు పేర్కొంది.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

దిగుమతి చేసుకుని ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎఫ్-టైప్ ఎక్స్‌జె వేరియంట్ ప్రారంభ ధర రూ. 1.25 కోట్లుగా ఉంది. అయితే దేశీయంగా తయారయ్యే ఎక్స్‌జె ధర 25 లక్షల తక్కువ ధరతో రూ. 99.99 లక్షలతో అందుబాటులో ఉంది.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

అంతే కాకుండా సరికొత్త ఎఫ్-పేస్ ప్రారంభ ధర రూ. 68.40 లక్షలుగా ఉంటే, ప్రాంతీయంగా ఉత్పత్తయ్యే ఎఫ్-పేస్ వేరియంట్ ధర రూ. 47.50 లక్షలు మరియు ఎక్స్ఇ ప్రారంభ వేరియంట్ ధర రూ. 39.90 లక్షలుగా ఉన్నాయి.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల

దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించిన నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు భారీ ఊపందుకునే అవకాశం ఉంది. టయోటా మోటార్స్ ఈ మధ్యనే సిహెచ్-ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

Most Read Articles

English summary
Jaguar XF Launched; Priced At Rs 47.50 Lakh — Big Cat Is Now 'Made In India'
Story first published: Thursday, February 23, 2017, 17:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X