భారతదేశపు తొలి డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ఆవిష్కరించిన మహీంద్రా

Written By:

మహీంద్రా విభాగం దేశీయ తొలి చోదక రహిత(డ్రైవర్ రహిత) ట్రాక్టర్‌ను ఢిల్లీలో ప్రదర్శించింది. వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతూ డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్‌ మహీంద్రా అభివృద్ది చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మహీంద్రా డ్రైవర్ లెస్ ట్రాక్టర్

మహీంద్రా వ్యవసాయాధారిత పరికరాల తయారీ విభాగం చెన్నై రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంలో ఈ చోదక రహిత ట్రాక్టర్‌ను అభివృద్ది చేసింది. మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా మరియు మహీంద్రా వ్యవసాయ పరికరాల తయారీ విభాగ అధ్యక్షుడు రాజేశ్ జెజురికర్ మరియు ఇతర మహీంద్రా ప్రతినిధుల సమక్షంలో డిల్లీలో ఈ ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు. వీటిని 2018 నుండి విపణిలోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

మహీంద్రా డ్రైవర్ లెస్ ట్రాక్టర్

ఈ సందర్భంగా మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ," మహీంద్రా పరిశోధనా మరియు అభివృద్ది విభాగం ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగానికి కావాల్సిన ఆధునిక పరికరాలను ఉత్పత్తి చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. చోదక రహిత ట్రాక్టర్‌ను వ్యవసాయ రంగానికి అంకితం చేస్తున్నందుకు సంతోంగా ఉందని" తెలిపారు.

Recommended Video
Tata Nexon Review: Specs
మహీంద్రా డ్రైవర్ లెస్ ట్రాక్టర్

ఇదే వేదిక మీద మహీంద్రా వ్యవసాయ పరికరాల తయారీ విభాగ అధ్యక్షుడు రాజేశ్ జెజురికర్ మాట్లాడుతూ,"శ్రామిక కొరతను ఎదుర్కొని ఆశించిన దిగుబడి సాధించడం కష్టతరం అవుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరిగింది. దీనికి అనుగుణంగా మహీంద్రా గత ఏడాది 'డిజిసెన్స్' పరిజ్ఞానాన్ని ఆవిష్కరించింది. అయితే, తేలికపాటి వ్యవసాయం కోసం ఇప్పుడు ఈ డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను రైతాంగం కోసం ప్రవేశపెట్టినట్లు" చెప్పుకొచ్చాడు.

మహీంద్రా డ్రైవర్ లెస్ ట్రాక్టర్

డ్రైవర్ లెస్ ట్రాక్టర్ పరిజ్ఞానాన్ని త్వరలో తమ లైనప్‌లో ఉన్న అన్ని ట్రాక్టర్లలో పరిచయం చేయడానికి మహీంద్రా సిద్దం అవుతోంది. 20హెచ్‌పీ నుండి 100హెచ్‌పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్లలో ఈ డ్రైవర్ లెస్ ట్రాక్టర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మహీంద్రా వెల్లడించింది.

మహీంద్రా డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌లో ఉన్న విభిన్న ఫీచర్లను చూద్దాం రండి...

ఆటో స్టీర్: జిపిఎస్ టెక్నాలజీ సహాయంతో స్టీరింగ్ ప్రక్కకు తిరగకుండా, పొడవాటి లైన్‌లో ట్రాక్టర్‌ను డ్రైవ్ చేస్తుంది.

ఆటో హెడ్ ల్యాండ్ టర్న్: ట్రాక్టర్ వరుస దుక్కులు చేస్తున్నపుడు, మన ప్రమేయం లేకుండా ఒక వరుస నుండి మరో వరుసలోకి వెళుతంది.

ఆటో ఇంప్లిమెంట్ లిఫ్ట్: పొలం దున్నడానికి ఉపయోగించే గొర్రు(నాగళి)ను మనం సహాయం లేకుండా అదే నేలలోకి దించడం, పైకి లేపడం చేస్తుంది మరియు లోదుక్కులను కూడా ఈ ట్రాక్టర్ ఆటోమేటిక్‌గా చేస్తుంది.

స్కిప్ పాసింగ్: ఒక వరుస తరువాత మరో వరుసను దున్నే సమయంలో డ్రైవర్ ప్రమేయం లేకుండా తనంటతానుగా వరుసలను మార్చుకుంటూ దున్నడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది.

జియోఫెన్స్ లాక్: ట్రాక్టర్ పొలం సరిహద్దులను దాటి ఇతర పొలాల్లోకి వెళ్లడాన్ని నివారించడానికి జియోఫెన్స్ లాక్ సహాయపడుతుంది.

మహీంద్రా డ్రైవర్ లెస్ ట్రాక్టర్

నియంత్రణ

రైతు ట్రాక్టర్‌కు వివిధ రకాల ఇన్‌పుట్లను రిమోట్ ద్వారా అందిస్తూ, ట్రాక్టర్ పనితీరును నియంత్రించవచ్చు. నియంత్రణ కోల్పోయినప్పుడు ట్రాక్టర్‌ను ఆపివేసే అవకాశం కూడా ఇందులో ఉంది వీటన్నింటిని ట్యాబ్లెట్ ద్వారా నియంత్రించవచ్చు.

రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్: ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయడం మరియు పూర్తిగా ఆఫ్ చేయడం వంటివి రిమోట్ ద్వారానే చేయవచ్చు.

English summary
Read In Telugu: Mahindra's First-Ever Driverless Tractor Showcased In India
Story first published: Tuesday, September 19, 2017, 22:09 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark