మహీంద్రా నుండి మరో ఎలక్ట్రిక్ కారు: ఏడు రుపాయలతో 10 కిమీలు ప్రయాణించవచ్చు

Written By:

భారతదేశపు ఏకైక ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం నేడు విపణిలోకి ఇ2ఒ ప్లస్ మోడల్‌ను సిటి స్మార్ట్ అనే మరో కొత్త వేరియంట్లో విడుదల చేసింది. సరికొత్త మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 7.46 లక్షలు(ఎక్స్-షోరూమ్ హర్యానా)గా ఉంది.

మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్

మహీంద్రా వారి నూతన ఎలక్ట్రిక్ కారు ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 140కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మరియు ఇది గంటకు 85కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్

దీనిని పి2, పి3, పి6 మరియు పి8 అనే నాలుగు విభిన్న వేరియంట్లలో, కోరల్ బ్లూ, స్పార్ల్కింగ్ వైన్, ఆర్కిటిక్ సిల్వర్ మరియు సాలిడ్ వైట్ అనే నాలుగు విభిన్న కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోగలరు.

మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్

ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్ కారులో మహీంద్రా కొత్తగా అభివృద్ది చేసిన ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ ఇందులో అందించింది. పి2, పి4 మరియు పి6 వేరియంట్లలో 48వోల్ట్ బ్యాటరీ, అదే విధంగా పి8 వేరియంట్లో 72వోల్ట్ కెపాసిటి గల బ్యాటరీలు ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్

48వోల్ట్ కెపాసిటి బ్యాటరీ 3 ఫేస్ ఎసి ఇండక్షన్ విద్యుత్ మోటార్‌కు సరఫరా చేస్తుంది, ఇది 25.5బిహెచ్‌పి పవర్ మరియు 70ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 72వోల్ట్ ఉన్న బ్యాటరీ కూడా అచ్చం అదే 3 ఫేస్ ఎలక్ట్రిక్ మోటార్‍‌కు సరఫరా చేస్తుంది, ఇది 40బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్

సరికొత్త ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్ కారులో అప్‌డేట్ అయిన ఫీచర్లు...

  • రిమోట్ ఆధారంతో కారు మొత్తం డయాగ్నస్టిక్ చేయవచ్చు.
  • స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా కనెక్టివిటి
  • నూతన మరియు అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • బ్రేక్ పవర్ రీజనరేటింగ్
  • వాలు మరియు పర్వత ప్రాంతాల్లో సురక్షితమైన డ్రైవ్ కోసం హిల్ హోల్డ్ కంట్రోల్
  • కారులో అదనపు ఛార్జింగ్ కోసం REVive® అనే వ్యవస్థను ప్రవేశపెట్టింది, పవర్ మరియు ఛార్జింగ్ సంభందించి ఆటోమేటిక్‌గా సమాచారాన్ని పంపిస్తుంది.
మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్

ఐ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ విడుదల సందర్భంగా మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగం స్పందిస్తూ," ఇప్పటి వరకు ఇండియాలో కార్లతో పోల్చుకుంటే,ఈ కారు నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఒక్క కిలోమీటర్‍‌కు 70పైసలు మాత్రమే ఖర్చవుతుంది.

మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్

స్వయం ఉపాధి గల వారు మరియు ఉద్యోగులు రూ. 1.6 లక్షల డిస్కౌంట్ ధరతో ఎంచుకోవచ్చు. అయితే, ఇది విడుదలైన నాటి నుండి తొలి ఆరు నెలలోపు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం పేర్కొంది.

మహీంద్రా ఇ2ఒ ప్లస్ సిటి స్మార్ట్ ఎలక్ట్రిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎలక్ట్రిక్ కార్లు సెగ్మెంట్లో భారీ అవకాశాలు ఉన్నాయి. చాలా మంది వాహన కొనుగోలుదారులు స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ కార్ల ఎంచుకోవడానికి సుముఖత చూపుతున్నారు. ఈ తరుణంలో భారత దేశపు ఏకైక ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా నిలిచిన మహీంద్రా విపణిలోకి ఇ2ఒ ప్లస్ ను కొత్త వేరియంట్లో ప్రవేశపెట్టింది.

మహీంద్రా ఇ2ఒ ఎలక్ట్రిక్ కారు కిలోమీటర్‍‌కు 70 పైసలు, అంటే పది కిలోమీటర్లు ఏడు రుపాయల ఖర్చుతోనే ప్రయాణించవచ్చు. కాబట్టి ఎలక్ట్రిక్ కార్లను వాడండి... మన జేబులో డబ్బులు మిగలటం కోసం కాదు.... భవిష్యత్తు తరానికి పరిశుభ్రమైన వాతారణం కల్పించడానికి.

English summary
Read In Telugu: Mahindra e2o Plus CitySmart Electric Car Launched In India; Prices Start At Rs 7.46 Lakh
Story first published: Saturday, September 23, 2017, 14:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark