భారత ప్రభుత్వం నుండి భారీ ఆర్డర్: 10 వేల ఎలక్ట్రిక్ కార్లకు టెండర్

భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్(EESL) ప్రభుత్వ రంగ సంస్థ 10,000 ఎలక్ట్రిక్ వాహనాలు మరియు 4,000 ఛార్జర్లకు టెండర్ ఆహ్వానించింది.

By Anil

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రభుత్వం నుండి 10,000 ఎలక్ట్రిక్ కార్ల ఆర్డర్‌ను సొంతం చేసుకోవడానికి సిద్దంగా ఉంది.

భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్(EESL) ప్రభుత్వ రంగ సంస్థ 10,000 ఎలక్ట్రిక్ వాహనాలు మరియు 4,000 ఛార్జర్లకు టెండర్ ఆహ్వానించింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే అందుబాటులో ఉంచే దిశగా దేశాన్ని చైతన్యపరిచడానికి వ్యూహాత్మకంగా వివిధ మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ విభాగాలు ఇప్పటి నుండి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి సిద్దమవుతున్నాయి.

Recommended Video

2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

భారత్ AC-001 మరియు భారత్ DC-001 ఛార్జర్ స్పెసిఫికేషన్లను పాటించే 3,000 యూనిట్ల AC ఛార్జర్లు మరియు 1,000 యూనిట్ల DC ఛార్జర్లు కావాలని భారత ప్రభుత్వం టెండర్‌లో వెల్లడించింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి మహీంద్రా మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. కాబట్టి మహీంద్రా ఈ భారీ ఆర్డర్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మహీంద్రా దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ కోసం ఈ మధ్య కాలంలో సుమారుగా 600 కోట్ల రుపాయల పెట్టుబడి పెట్టింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం ప్రస్తుంత ఇ2ఒ మరియు ఇవెరిటో అనే ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. ఇటాలియన్ డిజైన్ విభాగం పినిన్ఫారినా భాగస్వామ్యంతో నూతన ఎలక్ట్రిక్ కార్లను మహీంద్రా ఎలక్ట్రిక్ అభివృద్ది చేస్తోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

మహీంద్రా ఎలక్ట్రిక్ రెండు నూతన బ్యాటరీలను తమ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం అభివృద్ది చేసింది. ఈ బ్యాటరీలు ఉన్న నూతన ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ వ్యవస్థ గల కార్లు 40 బిహెచ్‌పి నుండి గరిష్టంగా 201బిహెచ్‌పి వరక్ పవర్ ఉత్పత్తి చేస్తాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం భవిష్యత్తులో విడుదల చేయనున్న విద్యుత్ కార్లు సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 350కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నాయి. అంతే కాకుండా, కేవలం 5 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని మరియు గరిష్టంగా గంటకు 200కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేయనుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

2030 నాటికి భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించే ఆలోచనకు వ్యూహాత్మకంగా, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2020 నాటికి ఏడాదికి 60,000 యూనిట్లకు పెంచడానికి మహీంద్రా సిద్దమవుతోంది. మరియు 48,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల నూతన ప్లాంటు ఏర్పాటు చేయనుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2030 నుండి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఉంది. ఎలక్ట్రిక్ కార్లను వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 10,000 ఎలక్ట్రిక్ కార్లకు ఆర్డర్ ఇచ్చింది. ప్రజలను ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకునే దిశగా ప్రభుత్వపు వ్యూహాత్మక ప్రణాళికలో ఇదీ ఒక భాగం అని చెప్పవచ్చు. అయితే తొలుత ప్రభుత్వమే స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra To Benefit From Government’s Order Of 10,000 EVs
Story first published: Saturday, August 19, 2017, 18:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X