26 ఏళ్ల తరువాత మళ్లీ ఒకేతాటిపైకి వచ్చిన మహీంద్రా-ఫోర్డ్

మహీంద్రా మరియు ఫోర్డ్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు పరస్పర అవగాహనతో భాగస్వామ్యపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

By Anil

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న మహీంద్రా మరియు ఫోర్డ్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు పరస్పర అవగాహనతో భాగస్వామ్యపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

 మహీంద్రా ఫోర్డ్ భాగస్వామ్యం

కొత్త వాహనాల అభివృద్ది, తయారీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్రపంచ విపణిలో కొత్త వాహనాల విడుదల, పంపిణీ వంటి ఎన్నో అంశాలకు సంభందించి పరస్పర సహకారం కోసం పోర్డ్ మరియు మహీంద్రా సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

 మహీంద్రా ఫోర్డ్ భాగస్వామ్యం

నూతన మొబిలిటి, ఎలక్ట్రిక్, కనెక్టెడ్ వెహికల్స్, కొత్త ఉత్పత్తుల అభివృద్ది, వనరుల కల్పన మరియు వాణిజ్యపరమైన సామర్థ్యాలను పంచుకోవడం వంటి అంశాల పరంగా మహీంద్రా మరియు ఫోర్డ్ పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోనున్నాయి.

Recommended Video

Tata Nexon Review: Specs
 మహీంద్రా ఫోర్డ్ భాగస్వామ్యం

దేశవ్యాప్తంగా మహీంద్రాకు ఉన్న విసృతమైన డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను ఫోర్డ్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ఫోర్డ్‌కు ఉన్న సామర్థ్యాన్ని మహీంద్రా వినియోగించుకుని అభివృద్ది చెందుతున్న ప్యాసింజర్ కార్ల మార్కెట్లో రాణించే ప్రణాళికలను రచిస్తున్నాయి. ఇరు సంస్థలు భాగస్వామ్యపు ఒప్పందం మూడేళ్లపాటు కొనసాగనుంది. ఒప్పందం ముగిసే సమయంలో భాగస్వామ్యం గురించి ఇరు సంస్థలు మరో నిర్ణయాన్ని తీసుకోనున్నాయి.

 మహీంద్రా ఫోర్డ్ భాగస్వామ్యం

"ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ది చెందుతున్న ఐదవ మార్కెట్‌గా నిలిచిన ఇండియాలో మహీంద్రా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందని", ఫోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ జిమ్‌ ఫార్లీ తెలిపాడు. వినియోగదారులకు ఉత్తమమైన వాహనాలను, సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది ఆయన చెప్పుకొచ్చాడు.

 మహీంద్రా ఫోర్డ్ భాగస్వామ్యం

గతంలో(1990) ఫోర్డ్ మోటార్స్‌తో కుదుర్చుకుని భాగస్వామ్యం ఆధారంగానే తాజా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా వెల్లడించారు. "ఈ నూతన ఒప్పందంతో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చి, సుస్థిరమైన పాలసీలను రూపొందించడం ద్వారా దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఉన్న అవకాశాలను అందుకోవచ్చని తెలిపాడు."

 మహీంద్రా ఫోర్డ్ భాగస్వామ్యం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యుటిలిటి వాహనాల తయారీలో మహీంద్రా మంచి అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం మహీంద్రా భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. టెక్నాలజీలో లీడర్‌గా ఉన్న ఫోర్డ్ మోటార్స్‌తో చేతులు కలపడంతో అతి త్వరలో ఇరు సంస్థల భాగస్వామ్యం నుండి నూతన ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా మహీంద్రాకు ఉన్న విసృతమైన నెట్‌వర్క్ ద్వారా ఫోర్డ్ మోటార్స్ ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra & Ford Partner To Explore Electricfication And Future Technology
Story first published: Wednesday, September 20, 2017, 18:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X