యాభై వేల మంది మనసు దోచుకున్న మహీంద్రా జీతో

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇండియన్ మార్కెట్లోకి జీతో కమర్షియల్ వాహనాన్ని విడుదల చేసింది. మంచి విక్రయాలు సాధించిన సందర్భంలో జీతో విడుదలయ్యి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సుమారుగా యాభై వేల మందికి పైగా సంతృప్తి చెందిన కస్టమర్లకు చేరువయ్యింది జీతో.

మహీంద్రా జీతో

చిన్న తరహా వ్యాపార మరియు కమర్షియల్ అవసరాల కోసం జీతోను ఎంచుకునే వారికి తక్కువ డౌన్ పేమెంట్, సులభరతమైన వాయిదా పద్దతులు మరియు రూ. 10 లక్షలు విలువైన ఉచిత ప్రమాధ భీమా కూడా కల్పిస్తోంది.

మహీంద్రా జీతో

స్మాల్ కమర్షియల్ వెహికల్ విభాగంలో జీతో 22.1శాతం మార్కెట్ వాటాను సాధించింది. 2017 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 25 శాతం వృద్దిని నమోదు చేసుకుంది మహీంద్రా జీతో.

మహీంద్రా జీతో

మహీంద్రా జీతో ట్రక్కులో DiGiSENSE అనే పరిజ్ఞానాన్ని అందించింది. ఇది వాహనం యొక్క అన్ని అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. జీతోకు సంభందించిన పూర్తి వివరాలను రిమోట్ ఆధారంగా యాజమనాన్ని తెలుసుకోవచ్చు.

మహీంద్రా జీతో

ఈ సంధర్బంగా మహీంద్రా ఆటోమేటివ్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా మీడియాతో మాట్లాడుతూ," రెండేళ పాటు జీతో మహీంద్రాకు మంచి ఫలితాలను సాధించిపెట్టడంతో, మరిన్ని అధునాతన ఫీచర్లను అదే విధంగా కస్టమర్లకు మెచ్చే శైలిలో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు."

మహీంద్రా జీతో

స్మాల్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో మార్కెట్ అంచనాలను తారుమారు చేసే లక్షణాలతో విడుదలైన జీతో ను కస్టమర్లు స్వాగతించారు. సుమారుగా ఎనిమిది మినీ ట్రక్కులను మహీంద్రా అందుబాటులో ఉంది. కారు తరహా ఇంటీరియర్, అత్యుత్తమ మైలేజ్, పవర్ మరియు అధిక సంపాదన అవకాశాలు ఉన్నాయని కస్టమర్లు నమ్ముతున్నారు.

మహీంద్రా జీతో

మహీంద్రా జీతో లో 625సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ అందించింది. దీని ధర రూ. 2.69 లక్షలు ఎక్స్-షోరూమ్‌‌గా ఉంది(వివిధ ప్రాంతాలను బట్టి, ఆన్ రోడ్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది).

English summary
Read In Telugu Mahindra Jeeto Celebrates 2 Years With Over 50,000 Happy Customers
Story first published: Monday, June 26, 2017, 10:39 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark