ఇది విన్నారా... 50,000ల యూనిట్ల మహీంద్రా కెయువి100 కార్లు రోడ్డు మీదకు
మహీంద్రా సుమారుగా 50,000 యూనిట్ల కెయువి100 యంగ్ ఎస్‌యూవీలను విక్రయించింది. జనవరి 2016లో విడుదలైన కెయువి100 మహీంద్రాకు భారీ సక్సెస్ తీసుకొచ్చింది.
మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన యంగ్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ కెయువి100 మరో మైలు రాయిని సాధించింది. జనవరి 2016 విపణిలోకి విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 50,000 యూనిట్లను విక్రయించినట్లు మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది.

భారీ పోటీ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో పరిచయం చేసిన నాటి నుండి 50,288 యూనిట్లను విక్రయించింది. మహీంద్రా లైనప్‌లో మంచి లాభాలు తెచ్చిన పెడుతున్న వాటిలో కెయువి100 ఒకటి.

కెయువి100 వాహనంతో మంచి సక్సెస్‌కు కారణమైనందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ రాజన్ వాదెరా కస్టమర్లకు ధన్యవాదాలు చెప్పారు.

సరికొత్త కెయువి100 ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 4.5 లక్షల నుండి 7 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉంది. ఇది చూడటానికి ఎస్‌యూవీ మరియు కాంపాక్ట్ కారులా ఉందని పేర్కొన్నాడు.

ఈ మధ్య కాలంలో సాధారణ కార్లకంటే యుటిలిటి వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు యుటిలిటి వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రస్తుతం ఇండియన్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి వితారా బ్రిజా, హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ అదే విధంగా కొన్ని మహీంద్రా ఎస్‌యూవీలైన స్కార్పియో, టియువి300 మరియు కెయువి100 వంటి ఉత్పత్తులు ఇందుకు నిదర్శనం.

మహీంద్రా కెయువి100 ఎస్‌యూవీ 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

పెట్రోల్ వేరియంట్ కెయువి100 లీటర్‌కు 18.14కిలోమీటర్ల మైలేజ్ మరియు డీజల్ వేరియంట్ కెయువి100 లీటర్‌కు 25.31కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.


Click it and Unblock the Notifications








