రహస్యంగా చిన్న ఎస్‌యూవీని పరీక్షిస్తున్న మహీంద్రా

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా తమ అతి చిన్న యుటిలిటి వెహికల్ కెయువి100 ఫేస్‌లిఫ్ట్‌ను తొలిసారి రహస్యంగా పరీక్షించింది. కెయువి100 ఫేస్‌లిఫ్ట్ ప్రంట్ డిజైన్ మరియు ఎక్ట్సీరియర్ మీద అనేక మార్పులతో టెస్టింగ్ కోసం రోడ్డెక్కింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మహీంద్రా కెయువి100 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ

మహీంద్రా తమ కెయువి100 ఫేస్‌లిఫ్ట్ గురించి డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి సమాచారం పొందడానికి వీల్లేకుండా నలుపు మరియు తెలుపు రంగులతో కూడిన స్టిక్కర్‌తో వెహికల్ మొత్తాన్ని కవర్ చేశారు.

Recommended Video
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా కెయువి100 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ

మహీంద్రా కెయువి100 లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, చిన్న పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్స్ మరియు నూతన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ కెయువి100లో ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, పొడగించబడిన ఎ-పిల్లర్ వివరణాత్మక టెయిల్ ల్యాంప్స్ మరియు పొడగించబడిన వీల్ ఆర్చెస్ గుర్తించడం జరిగింది. అయితే ఇంటీరియర్ ఫీచర్లను గుర్తించడం సాధ్యపడలేదు.

మహీంద్రా కెయువి100 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ

సరికొత్త కెయువి100 ఫేస్‌లిఫ్ట్ అవే మునుపటి ఎమ్‌ఫాల్క్ సిరీస్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో వస్తోంది. ఇందులోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా కెయువి100 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ

కెయువి100 లోని 1.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 77బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అప్‌కమింగ్ కెయువి100 ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా కెయువి100 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ

మైలేజ్ విషయానికి వస్తే, కెయువి100 డీజల్ మోడల్స్ లీటర్‌కు 25.32కిలోమీటర్లు, మరియు పెట్రోల్ కెయువి100 లీటర్‌కు 18.15కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

మహీంద్రా కెయువి100 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా కెయువి100 విడుదలయ్యి ఇప్పటికి ఏడాదిపైగా కావస్తోంది. ఫ్రెష్ లుక్ కోసం ఎక్ట్సీరియర్ మీద అనేక మార్పులు జరిగాయి. దీనిని 2017 చివరి నాటికి లేదా 2018 ప్రారంభంనాటికి విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Spy Pics: Facelifted Mahindra KUV100 Spied Testing For The First Time
Story first published: Wednesday, July 26, 2017, 10:36 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark