మహీంద్రా KUV100 NXT విడుదల: ధర రూ. 4.39 లక్షలు

Written By:

మహీంద్రా తమ కెయువి100 ఎన్ఎక్స్‌టి(KUV100 NXT) మైక్రో ఎస్‌యూవీని ముంబాయ్ వేదికగా మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త మహీంద్రా KUV100 NXT ప్రారంభ ధర రూ. 4.39 లక్షలు ఎక్స్-షోరూమ్(ముంబాయ్)గా ఉంది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

మహీంద్రా తమ కెయువి100 ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని రీఫ్రెష్ వెర్షన్‌లో అనేక కాస్మొటిక్ మార్పులు చేసి, ఎన్నో భద్రత ఫీచర్లను అందించి కెయువి100 ఎన్ఎక్స్‌టి పేరుతో విడుదల చేసింది. మహీంద్రా ఎలక్ట్రిక్ వెర్షన్ కెయువి100 ఎన్ఎక్స్‌టి ఎస్‌యూవీని వచ్చే ఏడాదిలో విడుదల చేయనుంది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి వేరియంట్లు మరియు ధరల వివరాలు...

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి ఐదు విభిన్న వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభించనున్నాయి. కెయువి100 ఎన్‌ఎక్స్‌టి లోని వేరియంట్లు - కె2, కె2 ప్లస్, కె4 ప్లస్, కె6 ప్లస్ మరియు కె8.(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్,ముంబాయ్‌గా ఉన్నాయి.)

Variant Petrol Diesel
K2 Rs 4.39 lakh Rs 5.39 lakh
K2+ Rs 4.79 lakh Rs 5.63 lakh
K4+ Rs 5.24 lakh Rs 6.11 lakh
K6+ Rs 6.04 lakh Rs 6.95 lakh
K8 Rs 6.40 lakh Rs 7.33 lakh
Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి ఇంజన్ మరియు గేర్‍‌బాక్స్ వివరాలు

సాంకేతికంగా మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లో లభించును. ఇందులో శక్తివంతమైన 1.2-లీటర్ కెపాసిటి గల కెయువి100 ఎన్‌ఎక్స్‌టి 5,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 82బిహెచ్‌పి పవర్ మరియు 3,500-3,600ఆర్‌పిఎమ్ మధ్య 115ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

అదే విధంగా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి లోని 1.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 3,750ఆర్‌పిఎమ్ వద్ద 77బిహెచ్‌పి పవర్ మరియు 1,750-2,250ఆర్‌పిఎమ్ మధ్య గరిష్టంగా 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి. మరియు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లలో డ్రైవ్ చేయడానికి మహీంద్రా తమ మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని ఇందులో పరిచయం చేసింది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి డిజైన్

రెగ్యులర్ వెర్షన్ కెయువి100తో పోల్చుకుంటే ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లో డిజైన్ పరంగా భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. క్రోమ్ తొడుగులున్న అగ్రెసిల్ ఫ్రంట్ గ్రిల్, ముందు మరియు వెనుక వైపున డ్యూయల్ టోన్ కలర్ బంపర్లతో పాటు సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

అంతే కాకుండా, డ్యూయల్ బ్యారెల్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, క్లియరెన్స్ టెయిల్ ల్యాంప్స్, సరికొత్త టెయిల్ గేట్ మరియు స్పాయిలర్ డిజైన్ అదే విధంగా సరికొత్త డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రత్యేకంగా నిలిచాయి.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి ఇంటీరియర్‌లో 7.0-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా కోసం డిస్ల్పేలా కూడా పనిచేస్తుంది. వీటితో పాటు, జిపిఎస్ న్యావిగేషన్, మహీంద్రా బ్లూసెన్స్ మొబైల్ అప్లికేషన్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

ఇంటీరియర్‌లో ఉన్న ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, పూర్తి స్థాయి బ్లాక్ ఇంటీరియర్, సిల్వర్ ట్రిమ్ ఇన్సర్ట్స్, పియానో బ్లాక్ డ్యాష్ బోర్డ్ మరియు నూతన ఫ్యాబ్రిక్ సీట కవర్లు, కోల్డ్ గ్లూవ్ బాక్స్, మల్టిపుల్ స్టోరేజ్ స్పేస్, మూడ్ లైటింగ్, పడల్ ల్యాంప్స్ మరియు అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

కెయువి100 ఎన్‌ఎక్స్‌టి లోని అన్ని వేరియంట్లలో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ స్టాండర్డ్‌గా ఉన్నాయి. అయితే కె2 వేరియంట్ మినహాయిస్తే అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. మిగతా అన్ని సేఫ్టీ ఫీచర్లతో పాటు రియర్ సీట్లలో ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ ఉన్నాయి.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కస్టమర్లను ఆకట్టుకోవడానికి మహీంద్రా తమ యంగ్ ఎస్‌యూవీ కెయువి100 ఎన్‍‌ఎక్స్‌టిలో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఎక్ట్సీరియర్ డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు మరియు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లతో ఈ పండుగ సీజన్‌లో భారీ అంచనాలతో మార్కెట్లోకి ప్రవేశించింది.

స్వల్ప మార్పులతో వచ్చే కొన్ని మోడళ్లు ఒక్కోసారి పెద్ద సక్సెస్ సాధిస్తాయి. కాబట్టి కెయువి100 ఎన్‌ఎక్స్‌టి ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో వేచి చూడాలి మరి.

English summary
Read In Telugu: Mahindra KUV100 NXT Launched In India; Prices Start At Rs 4.39 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark