జిఎస్‌టి ఎఫెక్ట్ - కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్

Written By:

ఏకీకృత పన్ను విధానం కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను(GST) విధానం కొన్ని సెక్టార్లను కుదిపేసినప్పటికీ, మరికొన్నింటి మీద ట్యాక్స్ తగ్గింపుకు కారణమైంది. దీంతో కొన్ని ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు జిసిటి ద్వారా ట్యాక్స్ తగ్గుముఖం పట్టడంతో తమ ఉత్పత్తుల మీద కొనుగోలు మీద భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.

జిఎస్‌టి ఎఫెక్ట్ కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్

ఎస్‌యూవీల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఉత్పత్తుల మీద భారీ మొత్తం మీద డిస్కౌంట్లను ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ500లోని డబ్ల్యూ4 వేరియంట్ మీద రూ. 49,000 లు ప్రకటించింది.

జిఎస్‌టి ఎఫెక్ట్ కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్

ఎక్స్‌యూవీ500 లోని డబ్ల్యూ6 మరియు డబ్ల్యూ8 మీద రూ. 73,000 లు మరియు డబ్ల్యూ10 మీద రూ. 84,000 ల వరకు తగ్గింపు ప్రకటించింది.

జిఎస్‌టి ఎఫెక్ట్ కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్

మహీంద్రా లైనప్‌లో యంగ్ ఎస్‌యూవీగా విపణిలోకి వచ్చిన కెయువి100 లోని కె2 మరియు కె4 డీజల్ వేరియంట్ల మీద రూ. 34,000 లు అదే విధంగా కె4 మరియు కె6 పెట్రోల్ వేరియంట్ల మీద రూ. 34,600 లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ కె8 మీద రూ. 43,000 ల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

మారుతి సుజుకి

మారుతి సుజుకి

భారత దేశపు అతి పెద్ద దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఇగ్నిస్ క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ కారు మీద గరిష్టంగా రూ. 3,400 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్స్

మరో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తమ ఉత్పత్తుల మీద ఎలాంటి డిస్కౌంట్లను ప్రకటించలేదు. అయితే ఓ కొత్త వాగ్దానం చేసింది, ఇప్పుడు కొనుగోలు చేసే కస్టమర్లకు జిఎస్‌టి అమలైన తరువాత తగ్గుముఖం పట్టిన ట్యాక్స్‌ను లెక్కించి కస్టమర్లకు వెనక్కి చెల్లిస్తామని చెబుతోంది.

జిఎస్‌టి ఎఫెక్ట్ కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్

వస్తు సేవల పన్నులో పొందుపరిచిన ట్యాక్స్ వివరాల మేరకు, చిన్న కార్ల మీద స్వల్పంగా ట్యాక్స్ పెరగడంటో వాటి ధరలు రూ. 3,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే పెద్ద వాహనాల మీద ట్యాక్స్ తగ్గడంతో ఎస్‌యూవీ మరియు లగ్జరీ వాహనాల ధరలు రూ. 60,000 వరకు తగ్గనున్నాయి.

జిఎస్‌టి ఎఫెక్ట్ కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్

జిఎస్‌టిలోని స్లాబుల్లో ట్యాక్స్ తగ్గించడంతో, కార్ల ధరలు తగ్గముఖం పట్టాయి. మరియు ఈ ట్యాక్స్ తగ్గింపు వలన కలిగే ఫలితాలు కస్టమర్లకు అందనున్నాయి. ప్రస్తుతం అన్ని ప్యాసింజర్ వాహనాల మీద గరిష్టంగా ఉన్న నిర్ధిష్ట పన్ను 28 శాతంగా ఉంది.

జిఎస్‌టి ఎఫెక్ట్ కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్

దీనికి తోడు జిఎస్‌టి మండలి 1,200సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్ల మీద 1 శాతం సెస్ అదే విధంగా 1,500సీసీ కన్నా తక్కువ సామర్థ్యం డీజల్ కార్ల మీద 3 శాతం సెస్ మరియు 15 శాతం సెస్ ‌ను పెద్ద ఎస్‌యూవీలు మరియు లగ్జరీ ప్యాసింజర్ వాహనాల మీద అమలు చేయనున్నారు. అంటే సెస్ మరియు నిర్ధిష్ట ట్యాక్స్‌ల కలయిక ప్రభుత్వానికి కార్ల తయారీ సంస్థలు చెల్లిస్తాయి. దీనిని వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో మిళితం చేస్తారు.

జిఎస్‌టి ఎఫెక్ట్ కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్

ఏకీకృత పన్ను విధానం పెద్ద ప్యాసింజర్ కార్ల ఉత్పత్తుల తయారీ సంస్థలకు మంచి లాభాలను చేకూర్చనుంది. కేవలం ఎస్‌యూవీలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టయోటా లకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరియు లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి ఉత్పత్తుల మార్కెట్ మరింత పెరగనుంది.

English summary
Read In Telugu GST Effect: Mahindra, Maruti Suzuki And Hyundai Offer Huge Discounts
Story first published: Thursday, June 8, 2017, 13:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark