మరో రెండు ఎలక్ట్రిక్ కార్లను విడుదలకు సిద్దం చేస్తున్న మహీంద్రా

Written By:

ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఏకైక సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల విభాగం విపణిలోకి రెండు కొత్త కార్లను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

2019 నాటికి ఈ రెండు నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల విపణిలో ఇ20 ప్లస్ హ్యాచ్‌బ్యాక్, ఇవెరిటో సెడాన్ మరియు ఇసుప్రో వ్యాన్ ఉన్నాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

అంతే కాకుండా మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం నెలకు 500 యూనిట్లను ఉత్పత్తి చేస్తున్న మహీంద్రా రానున్న నాలుగైదు నెల్లోపు 1,000 యూనిట్లకు పెంచనుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ, 2019 నాటికి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 5,000 యూనిట్లకు పెంచనున్నట్లు తెలిపాడు.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

మహీంద్రా రెవా బ్రాండ్‌ను సొంతం చేసుకున్న తరువాత 2010 నుండి ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు 4,000 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

నూతన ఎలక్ట్రిక్ కారు మోడళ్ల ఆవిష్కరణ, అభివృద్ది మరియు తయారీ కోసం సుమారుగా రూ. 500 కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టింది. రానున్న మూడేళ్లలోపు మరో 500 నుండి 600 కోట్ల రుపాయల వరకు పెట్టుబడులు పెట్టనుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

విపణిలోకి రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేయడాన్ని పవన్ గోయెంకా స్పష్టం చేశారు. అయితే, ఈ రెండు మోడళ్లు కూడా ప్రస్తుతం ఉన్న ఉత్పత్తుల ఆధారంగానే అభివృద్ది చేయనున్నారు. మొదటి మోడల్‌ను 2018 లో మరియు రెండవ మోడల్‌ను 2019లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నాడు.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

రెండు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు మహీంద్రా కెయువి100 ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వేరియంట్లో ప్రవేశపెట్టడానికి సుముఖంగా ఉంది. అంతే కాకుండా, దిగ్గజ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫినిన్ఫారినా కార్ బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ విపణిలో టెస్లా కార్లకు పోటీనిచ్చేలా ఫినిన్ఫారినా బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ సూపర్ కార్లను తయారు చేయనుంది.

ఫినిన్ఫారినా బ్రాండ్ పేరుతో అభివృద్ది చేయాలని భావిస్తున్న ఎలక్ట్రిక్ సూపర్ కార్లు అమెరికాకు చెందిన ప్రీమియమ్ మరియు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఉత్పత్తి చేసే విలాసవంతమైన ఖరీదైన కార్లకు గట్టి పోటీనివ్వనున్నాయి. ఫినిన్ఫారినా పేరుతో తయారయ్యే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు సరైన డిమాండ్ వచ్చే వరకు లాంచ్ చేయమని మహీంద్రా స్పష్టం చేసింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ దేశాలు చాలా వరకు పెట్రోల్ మరియు డీజల్‌తో నడిచే వాహనాలకు స్వస్తి పలికి, స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తున్నాయి. కానీ ఇండియాలో ఈ ధోరణి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పుడు భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలైన టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా మరియు సుజుకి వంటి కంపెనీలు తమ వంతుగా ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేస్తున్నాయి. అయితే, ఈ కంపెనీలు తమ ఉత్పత్తులను భారత్‌ విపణిలోకి ప్రవేశపెట్టడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Mahindra To Introduce Two New Electric Cars In India By 2019; Tesla Rival In The Works
Story first published: Wednesday, November 29, 2017, 14:03 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark