మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్ విడుదల: ధర రూ. 13.10 లక్షలు

Written By:

గత ఏడాది లిమిటెడ్ ఎడిషన్‌గా మహీంద్రా అందుబాటులోకి తెచ్చిన స్కార్పియో అడ్వెంచర్ ఎడిషన్ స్కార్పియోను 2017 మోడల్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే వీటిని నిరంతరం కాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నట్లు మహీంద్రా పేర్కొంది. ధర మరియు పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం రండి...

మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్ విడుదల

మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్ ఎడిషన్ టూ-వీల్ డ్రైవ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 13.10 లక్షలు మరియు ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 14.20 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి). సాధారణ స్కార్పియో టాప్ ఎండ్ వేరియంట్ కన్నా ఈ సరికొత్త స్కార్పియో ప్రారంభ ధర సుమారుగా రూ. 40,000 ల వరకు ఎక్కువగా ఉంది.

మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్ విడుదల

సాంకేతికంగా మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్‌లో 2.2-లీటర్ సామర్థ్యం గల టర్బో ఛార్జ్‌డ్ ఎమ్-హాక్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్ విడుదల

సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా స్కార్పియో ఎక్ట్సీరియర్ మీద స్పోర్టివ్ శైలిలో ఆకర్షణీయమైన డీకాల్స్ మరియు గ్రాఫిక్స్ జోడింపు గల డ్యూయల్ టోన్ పెయింట్ జాబ్ కలదు. బాడీ చుట్టూ అడుగు భాగాన స్పోర్టివ్ ప్లాస్టిక్ క్లాడింగ్, ముందు మరియు వెనుక వైపున రీడిజైన్ చేయబడిన బంపర్లు కలవు.

మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్ విడుదల

ఇతర ఫీచర్లైన పొగచూరిన టెయిల్ ల్యాంప్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ల మీద టర్న్ ఇండికేటర్స్ మరియు ఎర్రటి బ్రేక్ కాలిపర్లను కనబడకుండా చేసే గన్ మెటల్ ఫినిషింగ్ గల 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్ విడుదల

మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్ ఇంటీరియర్‌లో జరిగిన పెద్ద మార్పు సీట్ల కోసం సరికొత్త డ్యూయల్ టోన్ ఫాక్స్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే కలదు. ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ మరియు భద్రతపరమైన ఫీచర్లలో ఎలాంటి మార్పులు సంభవించలేదు.

English summary
Also Read In Telugu: 2017 Mahindra Scorpio Adventure Launched In India; Prices Start At Rs 13.10 Lakh, Mahindra Scorpio Adventure price, engine, features and specifications
Story first published: Wednesday, April 5, 2017, 10:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark