ఎక్స్‌యూవీ500 కాదు టియువి500: ఈ సారి క్లియర్‌గా దొరికిపోయింది!

Written By:

ఇండియన్ రోడ్ల మీద పొడవాటి వీల్‌బేస్‌తో బ్యాటిల్ ట్యాంక్ తరహాలో మహీంద్రా వెహికల్ మరో సారి పట్టుబడింది. అది ఎవరి వెహికల్‌ అనేది తెలియకుండానే మహీంద్రా వెహికల్‌ అని ఖచ్చితంగా చెప్పడానికి కారణం, మహీంద్రా తప్పిస్తే ట్యాంక్ తరహా వెహికల్స్‌ను మరే ఇతర సంస్థలు అభివృద్ది చేయలేదు.

టియువి500 ను రహస్యంగా పరీక్షించిన మహీంద్రా

మహీంద్రా టియువి300 ప్రేరణతో, టియువి300కి కొనసాగింపుగా ఈ వెహికల్‌ను పరీక్షిస్తోంది. కొంత మంది దీనిని టియువి500 అంటుంటే, మరికొంత మంది టియువి300ఎక్స్ఎల్ అంటున్నారు. బహుశా దీనిని టియువి500 పేరుతో ప్రవేశపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

టియువి500 ను రహస్యంగా పరీక్షించిన మహీంద్రా

యుటిలిటి వాహనాల తయారీ సంస్థగా మహీంద్రా ఇమేజ్ సొంతం చేసుకుంది. బొలెరో ద్వారా అందుకున్న విజయాన్ని టియువి300 ద్వారా కొనసాగించింది. అయితే కస్టమర్లు యుటిలిటి వాహనాల్లో ఎక్కువ సీటింగ్ కెపాసిటి కోరుకుంటారు. ఇందుకు కోసం టియువి300 కు కొనసాగింపుగా టియువి500 ను అభివృద్ది చేసింది.

టియువి500 ను రహస్యంగా పరీక్షించిన మహీంద్రా

ఇది నిజమని చెప్పాలంటే రహస్య పరీక్షలకు వస్తున్న టియువి500లోని చివరి వరుస సీటింగ్ వివరాలు తెలియాలి, పరీక్షించిన ప్రతిసారి చివరి అద్దాన్ని పూర్తిగా కప్పేసి ఇంటీరియర్ వివరాలు లీక్ అవ్వకుండా మహీంద్రా జాగ్రత్తపడుతోంది.

టియువి500 ను రహస్యంగా పరీక్షించిన మహీంద్రా

మొదటి మరియు రెండవ వరుస సీటింగ్ తరహాలో మూడవ వరుసలో సీటింగ్‌ ఫ్రంట్ సైడ్‌కు ఉండవచ్చు. ఫ్రంట్ డిజైన్, మొదటి మరియు రెండవ వరుస సీటింగ్ వంటివి అన్నీ కూడా టియువి300 ను పోలి ఉండనున్నాయి. బీజి మరియు బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కలర్ స్కీమ్, పియానో బ్లాక్ సెంటర్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే, మరియు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటివి రానున్నాయి.

టియువి500 ను రహస్యంగా పరీక్షించిన మహీంద్రా

మహీంద్రా టియువి500 ఎస్‌యూవీ టియువి300 లోని అదే 1.5-లీటర్ ఎమ్‌హాక్80 డీజల్ ఇంజన్‌తో రానుంది. ఈ ఇంజన్ 3,750ఆర్‌పిఎమ్ వద్ద 100బిహెచ్‌పి పవర్ మరియు 1,600-2,800ఆర్‌పిఎమ్ మధ్య 240ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోషిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉంది.

టియువి500 ను రహస్యంగా పరీక్షించిన మహీంద్రా

మహీంద్రా టియువి500 తో పాటు యు-321 కోడ్ పేరుతో ఓ ఎమ్‌పీవీని కూడా పరీక్షిస్తోంది, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా కు పోటీనివ్వనుంది. ఇక టియువి500 విషయానికి వస్తే, ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విపణిలోకి విడుదల అయ్యే అవకాశం ఉంది.

టియువి500 ను రహస్యంగా పరీక్షించిన మహీంద్రా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా బొలెరో స్థానాన్ని సరిగ్గా రీప్లేస్ మోడల్‌ టియువి500 అని చెప్పవచ్చు. అయితే ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందిస్తే ఇంకా బాగుటుంది. అయితే టియువి300 ఆధారిత మోడల్ టియువి500 లేవుట్లో ఆల్ వీస్ డ్రైవ్ సిస్టమ్‌ సెట్ అవుతుందా లేదా అనే విషయాన్ని మహీంద్రాకే వదిలేయాలి.

English summary
Read In Telugu: Mahindra TUV500 Spotted Testing Again

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark