హైవే మీద ట్రాక్టరును ఢీకొన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500: ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి

Written By:

భారత రహదారులు మీద ట్రాక్టర్లు ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అందులో ఒకటి మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఎస్కార్ట్ ఫార్మ్‌ట్రాక్ ట్రాక్టర్ ప్రమాదం. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ చెక్కుచెదరలేదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ మహీంద్రా ఎక్స్‌యూవీ500 మీద ప్రమాద తీవ్రత అధికంగానే ఉంది.

ఈ ఘటనలో మహీంద్రా ఎక్స్‌యూవీ ముందు మరియు ప్రక్కవైపుల తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. ప్రమాద వివరాలు మరియు ఫోటోలు ఇవాళ్టి కథనంలో...

హైవే మీద ట్రాక్టరును ఢీకొన్న మహీంద్రా

మహీంద్రా ఎక్స్‌యూవీ500 అనంతపురం నుండి బెంగళూరుకు వెళుతున్న సందర్భంలో చిక్కబళ్లాపూర్ సమీపంలోని పేరేసంద్ర వద్ద జాతీయ రహదారి మీద ట్రాక్టర్‌ను అధిక వేగంతో ఢీకొట్టింది.

హైవే మీద ట్రాక్టరును ఢీకొన్న మహీంద్రా

ఎక్స్‌యూవీ500 హైవే మీద కుడివైపున వెళుతోంది, ట్రాక్టర్ ఎడమవైపున వెళుతోంది. అయితే, రోడ్డును దాటేందుకు ట్రాక్టర్ ఉన్నట్లుండి కుడివైపు రావడంతో అప్పటి గరిష్ట వేగం మీదున్న ఎస్‌యూవీ డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.

హైవే మీద ట్రాక్టరును ఢీకొన్న మహీంద్రా

ఈ ఘటనలో ఎక్స్‌యూవీ500 భారీగానే దెబ్బతింది. అయితే, ఎస్‌యూవీలోని ఎయిర్ బ్యాగులు విచ్చుకోవడంతో ప్రయాణికుల సురక్షితంగా బయటపట్టారు. ట్రాక్టర్ పెద్ద టైరును ఢీకొనడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

హైవే మీద ట్రాక్టరును ఢీకొన్న మహీంద్రా

స్థానికుల కథనం మేరకు, ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. హైవే మదీ అడ్డదిడ్డంగా ట్రాక్టరును నడుపుతూ, రోడ్డు దాటే క్రమంలో పక్కవరుసలో వస్తున్న వాహనాన్ని గుర్తించకుండా సడెన్‌గా రోడ్డు మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

హైవే మీద ట్రాక్టరును ఢీకొన్న మహీంద్రా

పొలం పనులకు అవసరమయ్యే ట్రాక్టర్లు రోడ్ల మీద చాలా నెమ్మదిగా నడుస్తాయి. దీనికి తోడుగా, ట్రాక్టర్ ట్రాలీ మీద ఎలాంటి ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు మరియు ఇతర వాహనాలదారలను అప్రమత్తం చేసే రిఫ్లెక్టర్ స్టిక్కర్లు కూడా ఉండవు. వీటి కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

English summary
Read In Telugu: Mahindra XUV500 crashes into a tractor: Here’s the result

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark