ఎక్స్‌యూవీ500 కోసం సరికొత్త ఇంజన్ అభివృద్ది చేస్తున్న మహీంద్రా

Written By:

మహీంద్రా ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎక్స్‌యూవీ500 వాహనం కేవలం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. దీంతో పెట్రోల్ వెర్షన్‌లో కోరుకునే వారికి నిరాశను మిగిల్చింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, దేశీయ అగ్రగామి ఎస్‌యూవీ వాహన తయారీ సంస్థ మహీంద్రా సంస్థ మహీంద్రా తమ పాపులర్ ఎక్స్‌యూవీ500 కోసం సరికొత్త పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వేరియంట్

ప్రస్తుతం మహీంద్రా ఎమ్‌హాక్ ఇంజన్ ఫ్యామిలీ నుండి 2.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తోంది. దీని పవర్ మరియు టార్క్ గురించిన వివరాలు వెల్లడికాలేదు. అయితే ట్రాన్స్‌మిషన్ పరంగా మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో రానుంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వేరియంట్

2.2-లీటర్ పెట్రోల్ వెర్షన్‌లో రానున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 సరికొత్త జి-వేరియంట్లో విపణిలోకి విడుదల కానుంది. మహీంద్రా త్వరలో ఎక్స్‌యూవీ500 ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో అదే 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్‌తో విడుదల కానుంది. అయితే మునుపటి మోడల్ కన్నా ఇది 30బిహెచ్‌పి వరకు అధిక పవర్ ఉత్పత్తి చేయగలదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వేరియంట్

జీప్ తమ కంపాస్ ఎస్‌యూవీని విడుదల చేయడంతో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ నూతన ధరల శ్రేణిలో పోటీ నుండి పై చేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. ఎక్స్‌యూవీ500లో అందివ్వనున్న అదే పెట్రోల్ ఇంజన్ స్కార్పియోలో కూడా రానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వేరియంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కంపాస్‌కు పోటీగా మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 ను పెట్రోల్ వెర్షన్‌లో అభివృద్ది చేస్తోంది. అయితే కంపాస్‌కు గట్టి పోటీనిచ్చే విధంగా వీటి ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది. నూతన 2.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అత్యుత్తమ పవర్ మరియు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Mahindra XUV500 Petrol Model Under Development
Story first published: Monday, August 7, 2017, 18:22 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark