మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

Written By:
Recommended Video - Watch Now!
2017 Maruti Suzuki Baleno Alpha Automatic Launched In India | In Tamil - DriveSpark தமிழ்

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలిరియో కారును ప్రత్యేక వెర్షన్‌లో విడుదల చేసింది. మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 4.15 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 5.34 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల

మారుతి సెలెరియో 2014 లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదలైంది. అప్పట్లో భారతదేశపు తొలి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కారుగా అనతి కాలం మంచి గుర్తింపు పొందింది. గడిచిన నాలుగేళ్లలో అత్యుత్తమ విక్రయాలు సాధించి పాపులర్ హ్యాచ్‌బ్యాక్‍‌గా నిలిచింది.

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో...

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ ధరలు

వేరియంట్లు ఫ్యూయల్ టైప్ గేర్‌బాక్స్ ధర
Lxi Petrol MT 415,273
Lxi (O) Petrol MT 429,289
Vxi Petrol MT 448,418
Vxi Petrol AGS 491,418
Vxi (O) Petrol MT 463,908
Vxi (O) Petrol AGS 506,908
Zxi Petrol MT 473,934
Zxi Petrol AGS 516,934
Zxi (O) Petrol MT 522,043
మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఫేస్‌లిఫ్ట్ సెలెరియో మోడ్రన్ లుక్‌ను సొంతం చేసుకుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్, స్పోర్టి మెష్ క్రోమ్ గ్రిల్, సరికొత్త ఫాగ్ ల్యాంప్ తొడుగులు, మరియు క్రోమ్ ఫినిషింగ్‌ గల టెయిల్ గేట్ సెక్షన్స్ ఉన్నాయి.

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల

సెలెరియో ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బ్లాక్ మరియు బీజి ఇంటీరియర్ కలర్స్, సరికొత్త సీట్ల, నూతన ఫ్యాబ్రిక్ డిజైన్ గల డోర్ ప్యానల్స్ మరియు సిల్వర్ మెటీరియల్స్ ఉన్నాయి.

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల

సాంకేతికంగా సెలెరియో ఫేస్‌లిఫ్ట్‌లో అదే 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 67బిహెచ్ పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు. అదే విధంగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ కూడా ఆఫర్ చేస్తోంది.

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్‌లోని సేఫ్టీ ఫీచర్లు

పాదాచారుల భద్రత, ఆఫ్ సెట్ మరియు ఇంపాక్ట్ క్రాష్ రెగ్యులేషన్స్‌ను సెలెరియో ఫేస్‌లిఫ్ట్‌ పాటిస్తోంది. బాలెనో, ఎస్-క్రాస్, సియాజ్, ఎర్టిగా, ఇగ్నిస్ మరియు న్యూ డిజైర్ తరువాత ఈ సేఫ్టీ నియమాలను పాటించే ఏడవ మోడల్‌ సెలిరియో అని మారుతి వెల్లడించింది.

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల

భద్రత విషయంలో స్టాండర్డ్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అవి, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్. మరియు అన్ని వేరియంట్లోల యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను ఆప్షనల్‌గా అందిస్తోంది.

మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సెలెరియోలో పెద్ద మార్పలేవీ జరగలేదు, అయితే కొద్దిగా జరిగిన మార్పులతో చూడటానికి స్పోర్టివ్ లుక్ సొంతం చేసుకుంది. ఆకర్షణీయమైన ప్రైజ్ రేంజ్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌గా సెలెరియో గుర్తింపు తెచ్చుకుంది.

సిటి మరియు హైవే ల మీద ఒత్తిడి లేని ప్రయాణాల కోసం సెలెరియో మంచి ఎంపిక.

English summary
Read In Telugu: Maruti Celerio Facelift Launched In India; Prices Start At Rs 4.15 Lakh
Story first published: Friday, October 6, 2017, 9:38 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark