ఘోర ప్రమాదంలో రెండుగా విడిపోయిన మారుతి సియాజ్ కారు: వీడియో చూడండి!

Written By:

రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకీ అత్యంత ఘోరంగా సంభవిస్తున్నాయి. కొన్ని ప్రమాద దృశ్యాలు అయితే చూడటానికి కూడా సాధ్యం కాదు. అందుకు నిదర్శనం నిన్నటి రోజున(04/07/17) తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన. ఈ ఘోర ప్రమాదంలో కారు రెండుగా చీలిపోయింది. ఎలా జరిగింది?

రెండుగా విడిపోయిన మారుతి సియాజ్ కారు

ప్రమాదానికి కారణమైన కారు షోరూమ్‌కి చెందినదిగా గుర్తించడం జరిగింది. కస్టమర్ల కోసం టెస్ట్ డ్రైవ్ వెహికల్‌గా దీనిని వినియోగిస్తున్నారు. అలాంగులమ్ రహదారి మీద ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్నపుడు గరిష్ట వేగం వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.

రెండుగా విడిపోయిన మారుతి సియాజ్ కారు

స్థానికుల కథనం మేరకు, సియాజ్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న కస్టమర్ గరిష్ట వేగాన్ని పరీక్షించే సమయంలో అత్యధికంగా గంటకు 170కిలోమీటర్ల వేగాన్ని చేరుకున్నాడు. డబుల్ రోడ్ మీద డ్రైవ్‌ చేస్తున్నపుడు కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొన్ని రెండుగా వేరయ్యింది.

రెండుగా విడిపోయిన మారుతి సియాజ్ కారు

అయితే కారును డ్రైవ్ చేస్తున్న కస్టమర్‌ అనుభవరాహిత్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న ఇద్దరు షోరూమ్ ఉద్యోగులు అక్కడికక్కడే మరణించగా నెక్సా డీలర్ పరిస్థితి విషమంగా ఉంది.

రెండుగా విడిపోయిన మారుతి సియాజ్ కారు

ఎదురుగా వస్తున్న వాగహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టాడా ? లేదంటే ఎదైనా అవరోధాన్ని తప్పించే క్రమంలో ఇలా జరిగిందా ? అని విషయం స్పష్టం కావాల్సి ఉంది. అయితే డబుల్ రోడ్డు మీద గంటకు 170కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నపుడు ప్రమాదం జరిగిందని తెలిసింది.

రెండుగా విడిపోయిన మారుతి సియాజ్ కారు

ఇలాంటి ప్రమాదాలను ఎలా నివారించాలి ?

డివైడర్లు లేని డబుల్ రోడ్లు ఇండియాలో తీవ్ర ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డు వెడల్పు పరిమితంగా ఉండటంతో హై స్పీడ్‌ వద్ద వాహనాలను అదుపు చేయడం కాస్త కాష్టం కాబట్టి ఏ చిన్న పొరబాటు జరిగినా ప్రమాద తీవ్రత భారీగా ఉంటుంది.

రెండుగా విడిపోయిన మారుతి సియాజ్ కారు

డివైడర్ లేని సింగల్ లేన్ టు వే డబుల్ రోడ్డు మీద ఓవర్ చేయడాన్ని మానుకోండి. ముందు వెళుతున్న వాహనం దారి ఇవ్వకపోయినా, ఓవర్ టేక్ చేస్తున్నపుడు ఎదురుగా వాహనాలు వచ్చిన కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అయితే ఓవర్ టేక్ తప్పనిసరి సందర్భాల్లో జాగ్రత్తగా ఓవర్ టేక్ చేయాలి.

ఇలాంటి రహదారుల మీద వాహనాలను ఆపకండి. రోడ్డు వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రోడ్డు ప్రక్కన ఆపితే మరీ మంచిది. అదే విధంగా రోడ్డుకు ఇరువైపులా వచ్చే వాహనాలు దూరం నుండే మీ వాహనాన్ని గుర్తించే విధంగా నిలపడం మంచింది. ఇలా చేయడం ద్వారా డబుల్ రోడ్ల మీద ప్రమాదాలు అరికట్టవచ్చు. అయితే అన్నింటి కన్నా పరిమిత వేగంతో ప్రయాణించడం మరవకండి....

English summary
Maruti Ciaz Splits Into Two After High Speed Crash In Madurai
Story first published: Wednesday, July 5, 2017, 19:19 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark