మార్చి 3 న కలుద్దాం అంటున్న మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

Written By:

మారుతి సుజుకి తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో యొక్క మరింత శక్తివంతమైన వెర్షన్ బాలెనో ఆర్ఎస్‌ను విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఈ ఏడాది యొక్క రెండవ విడుదల మార్చి 3 న మారుతి సుజుకి ఖాయం చేసింది. అయితే జనవరి 13 న మారుతి తమ ఇగ్నిస్ క్రాసోవర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి సుజుకి తమ మొదటి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో ను 2015 లో దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది. తరువాత గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద మొదటి సారిగా బాలెనో యొక్క శక్తివంతమైన వెర్షన్ బాలెనో ఆర్ఎస్ ను ప్రదర్శించింది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

బాలెనో యొక్క ఆర్ఎస్ వెర్షన్ ను మారుతి యొక్క ప్రీమియమ్ షోరూమ్ నెక్సా ద్వారానే అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే నెక్సా విక్రయ కేంద్రంలో ఎస్-క్రాస్, బాలెనో మరియు ఇగ్నిస్ కార్లు అమ్మకాల్లో ఉన్నాయి.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

బాలెనో ఆర్ఎస్ సాధారణ బాలెనో తరహాలో అదే ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌తో రానుంది. అయితే రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ స్పోర్టివ్ వెర్షన్ రానున్న ఇందులో ముందు మరియు వెనుక వైపున అగ్రెసివ్ బంపర్ కలదు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

స్పోర్టివ్ వేరియంట్ బాలెనో ఆర్ఎస్ బై-జెనాన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, విద్యుత్‍‌చ్ఛక్తితో ఆపరేట్ చేయగల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ కలవు. ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషను సపోర్ట్ చేసే స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంటీరియర్‌లోని అధునాతన డ్యాష్ బోర్డ్ మీద అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఇంజన్ విషయానికి వస్తే ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 100బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానుంది.

కొలతల పరంగా,

కొలతల పరంగా,

  • పొడవు - 3995ఎమ్ఎమ్
  • వెడల్పు - 1745ఎమ్ఎమ్
  • ఎత్తు - 1510ఎమ్ఎమ్
  • వీల్ బేస్ - 2520ఎమ్ఎమ్
  • ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 37 లీటర్లు
మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి సుజుకి ఆర్ఎస్ బ్యాడ్జి అందుస్తున్న ఈ బాలెనోలో ఆర్ఎస్ అనగా రేసింగ్ స్పోర్ట్ అని అర్థం. ఇది సుమారుగా రూ. 8 నుండి 9 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఇది మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుతం ఉన్న పోలో జిటిఐ మరియు ఫియట్ పుంటో అబర్త్ వంటి వాటికి బలమైన పోటీనివ్వనుంది.

.

మారుతి సుజుకి అతి త్వరలో 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది. నూతన స్విఫ్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించండి....

 

English summary
Maruti Suzuki Baleno RS Launch On March 3; All You Need To Know
Story first published: Thursday, February 9, 2017, 18:24 [IST]
Please Wait while comments are loading...

Latest Photos