2017 దక్షిణ్ డేర్ ర్యాలీ వివరాలను వెల్లడించిన మారుతి సుజుకి

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సౌత్ ఇండియన్ 9వ మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 16, 2017 న బెంగళూరు నుండి దక్షిణ్ డేర్ ర్యాలీ మొదలవ్వనుంది.

By Anil

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దక్షిణ భారత 9వ మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 16, 2017 న బెంగళూరు నుండి దక్షిణ్ డేర్ ర్యాలీ మొదలవ్వనుంది.

2017 దక్షిణ్ డేర్ ర్యాలీ దక్షిణ భారతదేశంలోని కఠినమైన భూబాగాలకే పరిమితం కాలేదు. పశ్ఛిమ భారత భూబాగాల్లో కూడా ఈ ర్యాలీ కొనసాగనుంది. ఎంతో ఉత్సాహంతో సాగే ఈ ర్యాలీ కొత్త మార్గంలో వెళ్లనుండటంతో డైవర్లు ఎన్నో కఠినమైన భూబాగాలను ఎదుర్కోవాల్సి ఉంది.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ బెంగళూరులోని రాజాజీ నగర్‌లోని ఓరియన్ మాల్ నుండి జూలై 16, 2017 నుండి ప్రారంభం కానుంది. ర్యాలీ మొదటి స్టేజ్ జూలై 17, 2017 నుండి మొదలవ్వనుంది.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ మొదటి సారిగా పూనే దిశగా సాగనుంది. భారత దేశపు దక్షిణ భాగం నుండి పశ్చిమ దిశకు 2200కిమీల మేర ఈ ర్యాలీ సాగనుంది. చిత్రదుర్గ, బెల్గాం మరియు కోల్హాపూర్ మీదుగా వెళ్లే ఈ మార్గంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలతో పాటు కఠినమైన భూబాగాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

జూలై 21, 2017 నాటికి ర్యాలీ చివరి దశకు రానుంది. విజేతలకు నగదు బహుమతుల ప్రధానం జూలై 22, 2017 న చేయనున్నారు. సౌత్ ఇండియాలో జరిగే అతి పెద్ద మోటార్ స్పోర్ట్ ర్యాలీగా మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ పేరుగాంచింది.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ ర్యాలీలో పాల్గొనే రైడర్లు మరియు డ్రైవర్లకు పోటీ మరింత కష్టతరం కానుంది. దక్షిణ్ డేర్ ర్యాలీ రోజూ వారి అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగును చూస్తూ ఉండండి...

Most Read Articles

English summary
Read In Telugu: 2017 Maruti Suzuki Dakshin Dare To Kick-Off From Bangalore On July 16
Story first published: Friday, July 14, 2017, 17:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X