2017 దక్షిణ్ డేర్ ర్యాలీ తొలి రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

Written By:

లుబ్రికేషన్ ఆయిల్ దిగ్గజం మొబిల్1 సమర్పించిన 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ తొలి రోజు విజయవంతంగా ముగిసింది. బెంగళూరు నుండి ప్రారంభమైన ర్యాలీ సుమారుగా 463కిమీల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చిత్రదుర్గలో ముగిసింది.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

అల్టిమేట్ కార్స్ కెటగిరీలో 2 గంటల, 45 నిమిషాల 26 సెకండ్లలో స్టేజ్ 1 పూర్తి చేసి సామ్రాట్ యాదవ్ మరియు ఎస్ఎన్ నిజామి జోడి తొలిస్థానంలో నిలిచింది. ఇదే కెటగిరీలో మారుతి సుజుకి టీమ్‌లోని సందీప్ మరియు కరణ్ ఆర్య జోడి 2 గంటల, 46 నిమిషాల 35 సెకండ్ల వ్యవధిలో స్టేజ్ 1 పూర్తి చేసి రెండవ స్థానంలో నిలిచింది.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

మారుతి సుజుకి బృందంలో ఉన్న సురేశ్ రాణా మరియు అశ్విన్ నాయక్ జోడి తొలి రోజు ర్యాలీ పూర్తి చేసుకుని వరుసగా మూడవ స్థానంలో నిలిచింది. ఆఫ్ రోడింగ్ సవాళ్లతో కూడుకున్న మార్గంలో ఫస్ట్ డే ర్యాలీ మొత్తం తీవ్ర ఉత్కంఠతతో సాగింది.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీలోని అల్టిమేట్ బైక్స్ కెటగిరీలో 1 గంట, 50 నిమిషాల 0.8 సెకండ్ల వ్యవధిలో స్టేజ్ 1 లోని దూరాన్ని చేధించి తొలిస్థానంలో నిలవగా, 1:50:42 కాలంలో నటరాజ్ ఆర్ రెండవ స్థానంలో నిలవగా, అబ్దుల్ వహీద్ మూడవ స్థానంలో నిలిచాడు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

డే 1 ర్యాలీ ముగిసే సమయానికి ఎండ్యూరెన్స్ కెటగిరీలో, సుబీర్ రాయ్ మరియు నిరవ్ మెహ్తా వరుసగా ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో నిలిచారు. రెండవ రోజు ర్యాలీలో చిత్రదుర్గలోని కఠినమైన సవాళ్లతో కూడిన స్టేజ్‌లను పోటీదారుల ఎదుర్కోవాల్సి ఉంటుంది.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మొబిల్1 (Mobil1) 2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ మొదటి రోజు ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ర్యాలీ కఠిమైన భూభాగాలు గల పశ్చిమ దిశగా సాగుతుంటడం మరియు వర్షాలు పడుతుండటంతో రైడర్లు అనేక సవాళ్లను ఎదుర్కుంటున్నారు. అయినప్పటికీ ధైర్యం సడలకుండా ముందుకుసాగుతున్నారు.

2017 దక్షిణ్ డేర్ ర్యాలీ డైలీ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి...

English summary
Read In Telugu: 2017 Maruti Suzuki Dakshin Dare: Samrat Yadav and S N Nizami Lead After Day 1
Story first published: Tuesday, July 18, 2017, 18:40 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark